నేనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నా.. జాతి వివక్ష క్రికెట్‌లోనూ ఉంది: క్రిస్ గేల్

న్యూఢిల్లీ: అన్ని క్రీడల్లాగే క్రికెట్‌లోనూ జాతి వివక్ష ఉందని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తెలిపాడు. అంతేకాకుండా తన శరీర రంగు కారణంగా తాను కూడా ఎన్నోసార్లు వివక్షను ఎదుర్కొన్నానని వెల్లడించాడు. అయితే ఎప్పుడు.. ఎక్కడ ఇలాంటి అవమానం చవిచూశాడనే విషయం మాత్రం వెల్లడించలేదు. అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇక జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి.'

నల్లగా ఉన్నామని ఫూల్స్‌గా భావించవద్దు..
దీనిపై విండీస్ వీరుడు గేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘నల్ల జాతీయులు కూడా అందరిలాంటి వారే. మమ్మల్ని ఫూల్స్‌లా భావించవద్దు. నేను కూడా వివిధ దేశాలు పర్యటించినప్పుడు వర్ణ వివక్ష ను ఎదుర్కొన్నా. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. రేసిజం అనేది ఫుట్‌బాల్‌లోనే కాదు క్రికెట్‌లోనూ ఉంది' అని గేల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో రాసుకొచ్చాడు.
విరుష్కా మీరెప్పుడంటూ.. హార్దిక్ పాండ్యా తండ్రికావడంపై పేలుతున్న జోకులు, మీమ్స్!

అందుకే మాట్లాడటం లేదా?
నల్లజాతీయుడిని అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ గళం విప్పాడు. ఇంగ్లండ్ నల్లజాతి రేసర్ అయిన హామిల్టన్ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా' అని సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్ మీడియా వేదికపై నినదించారు.

బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్
ఆఫ్రికన్-అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి' అని ఎన్‌బీఏ సూపర్‌స్టార్ జోర్డాన్ అన్నాడు.
మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications