అతను 5 బంతులాడితే టీమిండియా గెలుస్తుంది: పుజారా
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా ప్రశంసల జల్లు కురిపించాడు. అభిషేక్ శర్మ 5 బంతులు ఓపికగా ఆడితే ప్రత్యర్థి కథ ముగుస్తుందని కొనియాడాడు. ముఖ్యంగా మూడో టీ20లో తనను ఇబ్బంది పెడుతున్న రోస్టన్ ఛేజ్‌ను అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తీరు అద్భుతమని ప్రశంసించాడు.
ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 30 బంతుల్లో 69 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో తనను ఇబ్బంది పెట్టిన రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ సంయమనం పాటించాడు. తన శైలికి భిన్నంగా 5-6 బంతులను ఓపికగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ గురించి ఓ క్రికెట్ వెబ్‌సైట్ షోలో మాట్లాడిన పుజారా.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరును కొనియాడాడు.

'అభిషేక్ శర్మ తన శైలికి భిన్నంగా 5-6 బంతులు ఓపికగా ఆడాడు. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ సంయమనంతో బ్యాటింగ్ చేయడం పెద్ద విషయం. ముఖ్యంగా ఛేజ్ బౌలింగ్‌ను ఓపికగా ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత తన సహజమైన శైలిలో చెలరేగిపోయాడు. 5-6 బంతుల్లోనే ప్రత్యర్థ కథను ముగించాడు. పిచ్ కండిషన్స్‌ను అందిపుచ్చుకొని పరుగులు చేయడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అతను సరిగ్గా అంచనా వేసాడు.'అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్‌లోని తొలి టీ20లో అభిషేక్ శర్మ 21 పరుగులు చేయగా..రెండో టీ20లో 20 పరుగులకు వెనుదిరిగాడు. కానీ మూడో మ్యాచ్‌లో అతను ప్రశాంతంగా ఇన్నింగ్స్ ప్రారంభించి 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయి అందుకున్న ఆటగాడిగా అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 1164 బంతుల్లోనే అభిషేక్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


