Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్‌కే‌లోకి హార్దిక్ పాండ్యా.. బింగ్ హింట్ ఇచ్చిన ధోనీ టీమ్!(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా సీఎస్‌కే షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ పోస్ట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్‌తో ట్రేడ్ డీల్‌పై సీఎస్‌కే సంప్రదింపులు జరుపుతుందనే ప్రచారం జోరు అందుకుంది. మరో 20 రోజుల్లో రిటెన్షన్ ప్రక్రియకు గడువు ముగియనుండగా.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.

IND vs NZ: సెంచరీతో రఫ్ఫాడించిన అభిషేక్ శర్మ.. సిరీస్‌ భారత్ కైవసం!

IND vs NZ: సెంచరీతో రఫ్ఫాడించిన అభిషేక్ శర్మ.. సిరీస్‌ భారత్ కైవసం!

హార్దిక్ పాండ్యా విషయంలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. అతన్ని అప్‌కమింగ్ సీజన్‌లో కెప్టెన్‌గా కొనసాగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఇతర జట్లలోకి వెళ్తాడా? లేక కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడుతాడా? అనేది చర్చనీయాంశమైంది.

Chennai Super Kings Drop Major Hint At Hardik Pandya Trade As MI Exit Talk Heats Up Ahead of IPL 2027

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్స్ వార్తలు తెరపైకి వచ్చాయి. హార్దిక్ కోసం సీఎస్‌కే ఆసక్తిగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే మంగళవారం సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ వీడియో హార్దిక్-సీఎస్‌కే ట్రేడ్ డీల్ వార్తలకు ఊతమిస్తోంది.

ఈ వీడియోలో జహీర్ ఖాన్ తన సపోర్ట్ స్టాఫ్ వివరాలను ప్రకటించాడు. చివర్లో ఫ్రాంచైజీ మస్కట్.. ట్రేడ్ డీల్ గురించి జహీర్ ఖాన్‌ను ప్రశ్నించింది. 33 నెంబర్ ప్లకార్డ్‌ను ప్రదర్శించింది. హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్ కూడా 33 కావడంతో ట్రేడ్ డీల్‌పై సంప్రదింపులు జరుగుతున్నాయనే అభిప్రాయం కలుగుతోంది. ఈ పోస్ట్‌కు అశ్విన్ బదులివ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

Also Read

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

ట్రేడ్ డీల్స్‌కు సీఎస్‌కే చాలా దూరంగా ఉండేది. 2021లో రాబిన్ ఊతప్పను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సీఎస్‌కే ఆ తర్వాత ఐదేళ్లు మళ్లీ ఈ డీల్ జోలికి వెళ్లలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మాత్రం సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ను ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. అయితే గత మూడు సీజన్లలో సీఎస్‌కే ఆశించిన రీతిలో రాణించకపోవడంతో జట్టును ప్రక్షాళన చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే కోచింగ్ టీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవాలనే లక్ష్యంతో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, October 28, 2026, 11:21 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+