Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: CSK హెడ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్

టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎస్‌కే సోమవారం ఓ ప్రకటన‌లో వెల్లడించింది. 'లెఫ్టార్మ్ టేకింగ్ ఓవర్.. చెన్నై సూపర్ కింగ్స్ నయా హెడ్ కోచ్ జహీర్ ఖాన్‌కు స్వాగతం'అని ట్వీట్ చేసింది. 18 ఏళ్ల పాటు సీఎస్‌కే హెడ్ కోచ్‌గా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతను ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో సీఎస్‌కే కొత్త కోచ్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

ఇక జహీర్ ఖాన్ గతంలో ముంబై ఇండియన్స్ టీమ్ డైరెక్టర్‌గా.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం లక్నో జట్టు నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నాడు. తన కెరీర్‌లో 100 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జహీర్ ఖాన్ 102 వికెట్లు తీసాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 610 వికెట్లు పడగొట్టాడు. సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి జహీర్ ఖాన్ భారత జట్టుకు ఆడాడు. ఈ ఇద్దరి కాంబో చెన్నైకి కలిసొస్తుందో లేదో చూడాలి.

Chennai Super Kings Appoint Zaheer Khan as Head Coach for IPL 2027 After Stephen Fleming s Exit

గౌరవంగా ఉంది..

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన సీఎస్‌కే జట్టులో భాగమవ్వడం సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని జహీర్ ఖాన్ తెలిపాడు. 'ఒక ఆటగాడిగా సీఎస్‌తో ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. ఆ పోటీని బాగా ఆస్వాదించాను. ముఖ్యంగా చెపాక్ స్టేడియంలో సూపర్ ఫ్యాన్స్ సృష్టించే వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఫ్రాంచైజీతో కలిసి పని చేసేందుకు ఆతృతగా ఉన్నాను.'అని జహీర్ ఖాన్ తెలిపాడు.

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

Also Read

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

మరింత బలంగా చెన్నై..

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని టీమ్ ఓనర్ రూపా గురునాథ్ అన్నారు. అతని అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని, అతని పర్యవేక్షణలో మరింత బలంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో క్రికెట్ పరిజ్ఞానం ఉన్న జహీర్ ఖాన్‌ను సీఎస్‌కే కుటుంబంలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామని సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. అతను ఎంతో మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దారని, 2000ల కాలంలో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారని గుర్తు చేశారు.

Story first published: Monday, September 21, 2026, 18:56 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+