Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens Asia Cup Final: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: శ్రీలంక కెప్టెన్

పవర్ ప్లే బౌలింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు తెలిపింది. ఈ ఒక్క మ్యాచ్ మినహా టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చామని పేర్కొంది. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆటపట్టు తమ ఓటమికి గల కారణాలను వెల్లడించింది. పవర్ ప్లే బౌలింగ్‌తో పాటు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడంతోనే ఓటమిపాలయ్యామని వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఆసియా గేమ్స్‌లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.

Womens Asia Cup 2026 ఫైనల్ అనంతరం హై డ్రామా.. ట్రోఫీ అందుకోని భారత్!

Womens Asia Cup 2026 ఫైనల్ అనంతరం హై డ్రామా.. ట్రోఫీ అందుకోని భారత్!

ఈ ఒక్క రోజు బాగా ఆడలేదు..

'గెలుపు ఓటములు ఆటలో భాగమే. ఒక జట్టు గెలుస్తుంది. ఒక జట్టు ఓడిపోతుంది. కానీ ఈ రోజు మేం మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పేలవంగా బౌలింగ్‌ చేశాం. భారత్ మా కంటే బాగా ఆడింది. ఈ ఓటమి నుంచి మేం పుంజుకుంటాం. ఎందుకంటే ఈ టోర్నీ తర్వాత మాకు ఆసియన్ గేమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము చాలా విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది.

Chamari Athapaththu Blames Powerplay Bowling For Sri Lanka s Defeat against India In Womens Asia Cup 2026 Final

ఈ ఫైనల్ మినహాయిస్తే.. టోర్నీ అంతటా మేం చాలా బాగా ఆడాం. మెరుగైన జట్లను ఓడించాం. ఈ రోజు కొద్దిగా తడబడ్డాం. అంతమాత్రాన మేం బలహీనమైన జట్టు అని కాదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాల్సింది. మళ్లీ పుంజుకుంటామనే నమ్మకం ఉంది. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో తమ ఆటను మెరుగుపర్చుకున్నారు. ముఖ్యంగా హర్షిత, ప్రబోధిని, నిలాక్షి చాలా బాగా ఆడారు. ఈ సానుకూల అంశాలను తర్వాతి సిరీస్‌కు తీసుకెళ్తాం.

స్మృతి, షెఫాలీ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), షెఫాలీ వర్మ(39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, చమరి ఆటపట్టు, చముడి ప్రబోదా తలో వికెట్ తీసారు.

Womens Asia Cup 2026: మళ్లీ భారత్ X పాక్ మ్యాచ్..? ఎప్పుడంటే..?

Also Read

Womens Asia Cup 2026: మళ్లీ భారత్ X పాక్ మ్యాచ్..? ఎప్పుడంటే..?

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ చమరి ఆటపట్టు(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), నిలాక్షిక సిల్వా(16 బంతుల్లో ఫోర్‌తో 22) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలరల్లో తెలుగు తేజం శ్రీచరణి(4/20) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా..దీప్తి శర్మ(3/19) మూడు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గాడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Monday, September 14, 2026, 14:54 [IST]
Other articles published on Sep 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+