Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens Asia Cup 2026: మళ్లీ భారత్ X పాక్ మ్యాచ్..? ఎప్పుడంటే..?

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. హాంగ్ కాంగ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 72 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్-2లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.

టీమిండియా కోచ్ పదవి.. ముందు నా పెళ్లాం పర్మీషన్ ఇవ్వాలి: ఆశిష్ నెహ్రా

టీమిండియా కోచ్ పదవి.. ముందు నా పెళ్లాం పర్మీషన్ ఇవ్వాలి: ఆశిష్ నెహ్రా

మరోవైపు భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంకా తేలలేదు. బంగ్లాదేశ్, యూఏఈలో గెలిచిన జట్టుతో భారత్ తలపడనుంది. ఈ రెండు జట్లలో ఏది వచ్చినా భారత్ సునాయసంగా ఫైనల్ చేరుతుంది. ఫామ్ చూసుకున్నా.. గత చరిత్రను పరిశీలించినా.. భారత్ ఫైనల్ చేరడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పాకిస్థాన్ కూడా శ్రీలంకను ఓడించి ఫైనల్ చేరితే..మరోసారి దాయాదీ దేశాలు తలపడనున్నాయి.

India vs Pakistan Final Clash Awaits If Both Teams Reach Women s Asia Cup 2026 Final

సెప్టెంబర్ 13(ఆదివారం) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఇరు జట్ల మధ్య పోరు ఏకపక్షంగా ముగిసింది. పాకిస్థాన్ 55 పరుగులకు కుప్పకూలగా.. భారత్ 8.4 ఓవర్లలోనే 56 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడినా.. ఆ జట్టు కోచ్ వహాబ్ రియాజ్ మాత్రం టైటిల్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

అటు అయ్యర్ టీమ్.. ఇటు గిల్ సేన! ఒకే రోజు టీమిండియాకు రెండు మ్యాచ్‌లు!

Also Read

అటు అయ్యర్ టీమ్.. ఇటు గిల్ సేన! ఒకే రోజు టీమిండియాకు రెండు మ్యాచ్‌లు!

అంతేకాకుండా ఆసియా కప్ గెలవకపోయినా పర్లేదు కానీ భారత్‌ను ఓడించాలని ఓ పాకిస్థాన్ అభిమాని వహాబ్ రియాజ్‌ను కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ రిక్వెస్ట్‌పై భారత అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యుద్దమైనా.. ఆటైనా భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని సెటైర్లు పేల్చుతున్నారు. గత మ్యాచ్‌లో ఇచ్చిన షాక్ సరిపోలేదా? ఫైనల్‌కు రండి ఈ సారి అంతకు మించిన ట్రీట్ టీమిండియా ఇస్తుందని మరో అభిమాని కామెంట్ చేశాడు.

Story first published: Tuesday, September 8, 2026, 21:28 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+