Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: టెంట్స్‌లో డ్రెస్సింగ్ రూమ్స్.. పక్కనే వాష్ రూమ్స్! పునరాలోచనలో బీసీసీఐ

ఆసియా గేమ్స్ 2026 టోర్నీకి పంపే భారత జట్టు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జపాన్ వేదికగా జరిగే ఈ టోర్నీకి ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. జపాన్‌లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడం, వాష్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అధ్వానంగా ఉండటంతోనే బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సూర్యవంశీ, జైస్వాల్‌ను వదులొద్దు.. కఠినంగా వ్యవహరించాలి: సంజయ్ మంజ్రేకర్

సూర్యవంశీ, జైస్వాల్‌ను వదులొద్దు.. కఠినంగా వ్యవహరించాలి: సంజయ్ మంజ్రేకర్

అయితే ఇప్పటీ ఈ టోర్నీలో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి.

BCCI Unhappy With Asian Games 2026 Facilities May Opt for Second-String Team

అబ్జర్వర్ రిపోర్ట్‌తో నిర్ణయం..

జపాన్‌లోని ఐచి నగోయా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. జపాన్‌లోని వసతులపై బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా అసంతృప్తిగా ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. 'బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం జపాన్‌లోని సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్నాయి. అందుకే అక్కడికి అబ్జర్వర్‌ను పంపించాలనుకుంటున్నాయి. అబ్జర్వర్ నివేదికను బట్టి జట్టు మార్పు విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ సరైన వసతులు లేకపోతే.. ద్వితీయ శ్రేణి జట్టును పంపే అవకాశం ఉంది.

ఇప్పటికే సదుపాయాల గురించి జపాన్ ఒలింపిక్స్ అధికారులతో మాట్లాడాం. డ్రెస్సింగ్ రూమ్స్‌ను టెంట్లలో ఏర్పాటు చేశారు. వాష్‌రూమ్స్ టెంట్లకు 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

టీమిండియా టీ20 కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ ప్రత్యేక నియామకం!

Also Read

టీమిండియా టీ20 కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ ప్రత్యేక నియామకం!

కనీసం 2000 మంది చూడాలి..

బీసీసీఐతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా జపాన్‌లోని వసతులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్‌ను కనీసం 2 వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలుస్తోంది. చైనా వేదికగా జరిగిన గత ఆసియా గేమ్స్‌లో భారత్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు సాధించాయి.

Story first published: Friday, August 28, 2026, 16:59 [IST]
Other articles published on Aug 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+