
ప్రస్తుతానికి మాకు ఆ ఆలోచనే లేదు..
ఆటగాళ్ల జీతాల్లో కోత విధించమని, ఉద్యోగులను తీసేసే ఆలోచన కూడా తమకు లేదని బోర్డు ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ‘కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లు గత అక్టోబర్‌లో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి బీసీసీఐ ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశారు. కరోనా మహమ్మారికి ముందే ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతానికి జీతాల్లో కోతగానీ, ఉద్యోగుల తొలగింపు గానీ ఉండదు. దానికి బదులు ట్రావెలింగ్ హాస్పిటాలిటీ తదితర విషయాల్లో కాస్ట్ కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దు అయితే మాత్రం అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం 'అని ధుమాల్ పేర్కొన్నారు.

యాభై శాతం కోత..
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు నష్టనివారణ చర్యలు ప్రారంభించాయి. ఇక తమ ఉద్యోగులు, క్రికెటర్ల జీతాల్లో ఆరు నెలల వరకు యాభై శాతం కోత విధిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ బోర్డులు ఇప్పటికే ఆటగాళ్లు, స్టాఫ్ జీతాల్లో కోత పెట్టాయి.
కోహ్లీ vs స్మిత్.. బెస్ట్ ఎవరో చెప్పిన ఆరోన్ ఫించ్.. భారత్-ఆసీస్ ఆల్‌టైమ్ వన్డే టీమ్ ప్రకటన!

విదేశాల్లో ఐపీఎల్
కరోనా లాక్‌డౌన్ కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్-2020 సీజన్‌ను విదేశాల్లో నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల అరుణ్ ధుమాల్
మాట్లాడుతూ.. ‘సురక్షిత వాతావరణంలో ఐపీఎల్ నిర్వహించడం సాధ్యమైతే మా తొలి ప్రాధాన్యత భారత్‌లోనే. కానీ పరిస్థితులు అనుకూలించకున్నా, ఈ ఏడాది క్రికెట్ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు మరో అవకాశం లేకపోతే విదేశాల్లో నిర్వహించేదానిపై ఆలోచిస్తాం'అని అన్నారు.
బాంబు పడాలని సరదాగా కోరుకుంటే.. నిజంగానే ఉగ్రదాడి జరిగింది: సంగక్కర

ఇదే తొలిసారి కాదు..
ఐపీఎల్ విదేశాల్లో నిర్వహించడం కొత్తేం కాదని గతంలో రెండు సార్లు నిర్వహించిన విషయాన్ని ధుమాల్ గుర్తుచేశారు. ఇప్పటికే శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ రెండు దేశాల్లో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని, విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడం ఒక ప్రతిపాదన మాత్రమేనని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే నూటికి నూరు శాతం భారత్‌లోనే ఈ టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై జూన్ 10న ఐసీసీ తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జూన్ 10 తర్వాతనే ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలని సౌరవ్ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
