రోహిత్ బాగా ఆడుతున్నాడు.. ఇకనైనా ఈ పనికిమాలిన పుకార్లు ఆపండి: బీసీసీఐ సెక్రటరీ
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఫుల్‌స్టాప్ పెట్టారు. బీసీసీఐ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పుకార్లపై స్పందించారు. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడని, ఇకనైనా ఈ పనికిమాలిన పుకార్లను ఆపేయాలని సూచించారు.
ముంబైలోని బీసీసీఐ హెడ్ ఆఫీస్‌లో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దేవజిత్ సైకియా అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ఆటగాళ్ల గాయాల బెడద, రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చించారు. ఈ సమావేశానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దూరంగా ఉన్నాడు.

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పిస్తారనే పుకార్లను దేవజిత్ సైకియా ఖండించాడు. 'రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌ల్లోనూ చాలా బాగా ఆడుతున్నాడు. లార్డ్స్ వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో.. నేను ఈ పనికిమాలిన పుకార్లకు ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు.'అని సైకియా స్పష్టం చేశాడు.
టీమిండియా ఆటగాళ్ల గాయాల బెడదపై స్పందిస్తూ.. 'రెండు నెలల పాటు ఐపీఎల్‌లో ఆడిన తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లిన 15 మంది సభ్యుల జట్టులో ముగ్గురు- నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల పర్యటనలకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇచ్చేలా, ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేలా వీలుగా క్రికెట్ షెడ్యూల్‌లో తగిన ఏర్పాట్లు చేస్తాం.
నేషనల్ సెంటర్ ఫర్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్‌లో హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ, అక్కడి ఫిట్‌నెస్, పునరావస సౌకర్యాలను పర్యవేక్షించడానికి ఇప్పటికే 16 మంది అర్హత గల వ్యక్తుల విధుల్లో ఉన్నారు.'అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

