Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మోహ్సిన్ నఖ్వీ‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాను: బీసీసీఐ సెక్రటరీ

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌ మోహ్సిన్ నఖ్వీతో సమావేశమవ్వడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. సాధారణ ఆనవాయితి ప్రకారమే అతనితో మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అతనే వచ్చి తన పక్కన కూర్చున్నారని గుర్తు చేశారు.

మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ఏసీసీ ఛైర్మన్ హోదాలో మోహ్సిన్ నఖ్వీ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా.. బీసీసీఐ నుంచి దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. స్టేడియంలో రాయల్ బాక్స్‌లో ఈ ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం, కరచాలనం చేసుకోవడం విమర్శలకు దారి తీసింది.

అందుకే భారత ఆటగాళ్లకు తరుచూ గాయాలు: బీసీసీఐ సెక్రటరీ

అందుకే భారత ఆటగాళ్లకు తరుచూ గాయాలు: బీసీసీఐ సెక్రటరీ

క్షమాపణలు చెప్పాలంటూ..

మైదానంలో ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోనప్పుడు.. బోర్డు పెద్దలు ఎలా మాట్లాడుకుంటారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవడానికి నిరాకరించిన భారత్.. అతనితో మాత్రం కరచాలనం చేస్తుందని మండిపడ్డారు. ఇది భారత ఆటగాళ్లతో పాటు అభిమానులను అవమానించడమేనని, రాజీవ్ శుక్లాతో పాటు దేవజిత్ సైకియా అభిమానులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

BCCI Secretary Devajit Saikia Reveals Why He Met Mohsin Naqvi During Womens Asia Cup 2026 Final

ఈ విమర్శలపై స్పందించిన దేవజిత్ సైకియా అభిమానులకు వివరణ ఇచ్చాడు. 'మేమేమి ఎవరినీ కలవకుండా ఉండలేదు. టాస్ వేసినప్పటి నుంచి ఆట ముగిసే వరకు నేను బయట రాయల్ బాక్స్ సీట్లలోనే కూర్చున్నాను. మ్యాచ్ మొత్తం అక్కడి నుంచే చూశాను. మ్యాచ్ సమయంలో అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరు నన్ను కలిసారు.

ఆనవాయితే ప్రకారమే మాట్లాడాను..

ఒకరు వచ్చి నా పక్కన కూర్చుంటే.. తర్వాత రాజీవ్ శుక్లా వచ్చి నా పక్కన కూర్చున్నారు. మీరు చెప్తున్న ఆ వ్యక్తి(మోహ్సిన్ నఖ్వీ) కూడా డిప్యూటీ చైర్మన్ ఖాలిద్ సాహెబ్‌తో కలిసి వచ్చి పక్కన కూర్చున్నారు. అది అక్కడ మామూలుగా జరిగేదే. ఎవరైనా వస్తే ఒకరినొకరు కలవడం, మాట్లాడుకోవడం సాధారణ ఆనవాయితే.'అని సైకియా వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణపై అభిమానులు సంతృప్తిగా లేరు. బోర్డు పెద్దలకు ఒక న్యాయం? ఆటగాళ్లకు మరో న్యాయమా? అంటూ మండిపడుతున్నారు.

రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!

Also Read

రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!

ప్రజల కోరిక మేరకే..

మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ నిరాకరణపై మాట్లాడుతూ.. దేశ ప్రజల ఒత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని స్పష్టం చేశాడు. 'ఆసియా కప్‌లో ట్రోఫీ అనేది వివాదాస్పదమైన విషయం. మన పురుషుల జట్టు దాదాపు ఏడాదిన్నర క్రితం ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత మొత్తం పరిస్థితులే మారిపోయాయి.

దాంతో పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, వాళ్లతో క్రికెట్ ఆడకూడదని దేశ ప్రజల నుంచి మాపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కానీ బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో అన్ని దేశాలతో ఆడాలనేది భారత ప్రభుత్వం యొక్క విధానం. అందుకే మల్టీ నేషనల్ టోర్నీల్లో పాకిస్థాన్‌తో భారత్ ఆడుతోంది.'అని సైకియా తెలిపాడు.

Story first published: Monday, September 14, 2026, 10:15 [IST]
Other articles published on Sep 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+