రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డే.. రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేసింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న కథనాలు, జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో రోహిత్ శర్మ కొనసాగుతారని స్పష్టం చేశారు.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 11, 26 విఫలమయ్యాడు. దాంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి. రెండో వన్డే జరుగుతుండగానే.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల నుంచి తొలగించామని భారత సెలెక్టర్లు రోహిత్ శర్మకు సమాచారమిచ్చారని, భవిష్యత్తు తేల్చుకోవాలని సూచించారని ఆ కథనంలో పేర్కొన్నారు.

రోహిత్‌కు లాస్ట్ మ్యాచ్ కాదు..
ఈ వార్త సెన్సేషన్‌గా మారగా.. మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో కూర్చున్న రోహిత్ శర్మ దిగాలుగా కనిపించాడు. కోహ్లీ, బుమ్రాలు కూడా బాధలో ఉన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. అంతేకాకుండా రవి శాస్త్రి తన వ్యాఖ్యానంలో రోహిత్ శర్మ ఘనతలను ప్రస్తావించాడు. దాంతో ఈ రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. అంతేకాకుండా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పలువురు స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు సెలెక్టర్లు రోహిత్ శర్మకు సమాచారామిచ్చారనే వార్తలను ధృవీకరిస్తూ వీడియోలు చేశారు.
ఆఖరి వన్డే కోసం రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు లార్డ్స్ చేరుకున్నారనే వార్తలు కూడా రోహిత్ రిటైర్మెంట్ ఖాయమనే సంకేతాలను ఇచ్చాయి. సెన్సేషన్‌గా మారిన ఈ వార్తలపై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన దేవజిత్ సైకియా.. ఈ వార్తలను కొట్టిపారేసారు.
రోహిత్ రిటైర్మెంట్ చర్చ జరగలేదు..
'రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆదివారం లార్డ్స్‌లో జరిగే మ్యాచ్ రోహిత్ శర్మ చివరిదనే చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ శర్మ రెగ్యులర్ సభ్యుడు. జట్టులో ఉన్నంత కాలం అతను దేశానికి ప్రాతినిథ్యం వహిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే లార్డ్స్ వన్డే అతనికి చివరి మ్యాచ్ కాదు.'దేవజిత్ సైకియా పేర్కొన్నాడు.
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 15 నెలల సమయం ఉందని, రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లను ఆడించాలనుకుంటున్నామని సెలెక్టర్లు అతనికి చెప్పినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు రోహిత్ శర్మకు సెలెక్టర్లు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. భవిష్యత్తును నిర్ణయించుకోవాలని, ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం వన్డే టీమ్‌లోకి ఎంపిక చేయమని స్పష్టం చేశారని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

