బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవిని ఛీ కొట్టిన మాజీ ఆటగాళ్లు!
భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. భారత దిగ్గజ ఆటగాళ్లతో ఈ పదవిని భర్తీ చేయాలని భావించిన బీసీసీఐకి చుక్కెదురవుతోంది. దాదాపు 100 టెస్టులు ఆడిన ఇద్దరు మాజీ దిగ్గజ క్రికెటర్లను సెలెక్టర్ పదవి చేపట్టాలని బీసీసీఐ కోరగా.. వారు ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే చీఫ్ సెలెక్టర్ పదవి బాధ్యతల నుంచి అజిత్ అగార్కర్ తప్పుకున్నసంగతి తెలిసిందే. తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు అతను విముఖ వ్యక్తం చేయడంతో కొత్త చీఫ్ సెలెక్టర్ను ఎంపిక చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఏర్పడింది.
జీతాలు పెంచినా..
ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ కోటాలో సెలెక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 14తో ఈ గడువు కూడా ముగిసింది. ప్రస్తుత కమిటీలోని ప్రజ్ఞాన్ ఓఝా తాత్కాలిక ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓఝా , ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ఎస్ఎస్ దాస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. సెలెక్షన్ కమిటీలోకి అనుభవం కలిగిన ఆటగాళ్లను తీసుకురావాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇందుకోసం సెలెక్టర్ల జీతభత్యాలను కూడా గణనీయంగా పెంచేందుకు సుముఖత చూపింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి సెలెక్షన్ కమిటీల వార్షిక బడ్జెట్ను కూడా గణనీయంగా పెంచింది. అయినప్పటికీ, ఈ చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టేందుకు సీనియర్ ఆటగాళ్లు ముందుకు రావడం లేదు. పోటీలో ఉంటాడని భావించిన మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సైతం దరఖాస్తు చేసుకోలేదు.
అనవసర మిమర్శలు ఎందుకని..
ఈ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు పూర్తవ్వాలి. జీతభత్యాలు పెంచి, భారీ ఆఫర్లు ఇస్తున్నా సీనియర్ ఆటగాళ్లు విముఖత చూపడంతో ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని పూర్తి చేయడానికి బీసీసీఐ అపసోపాలు పడుతోంది.
కొత్త సెలెక్టర్ కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. సెలెక్టర్ పదవి ముళ్ల కిరీటం లాంటిదని మాజీ ఆటగాళ్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు అనుకూలంగా ఉంటే ప్రశంసలని, లేకుంటే జీవితాంతం విమర్శలు వెంటాడుతాయని మాజీ క్రికెటర్లు భయపడుతున్నట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


