Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూపీఎల్ 2027 వేలం ముహుర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే?

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు ముహుర్తం ఖరారైంది. ఈ టోర్నీని జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఐదు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించేందుకు సెప్టెంబర్ 28 డెడ్‌లైన్‌గా పేర్కొంది. అక్టోబర్ 29న కొచ్చి వేదికగా డబ్ల్యూపీఎల్ 2027 వేలం జరిగే అవకాశం ఉంది. పురుషుల వేలం కూడా అక్కడే జరగొచ్చు. మరికొద్ది రోజుల్లోనే డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది.

సంజూ శాంసన్‌ను ఏ లెక్కన ఆడించారు: మహమ్మద్ కైఫ్

సంజూ శాంసన్‌ను ఏ లెక్కన ఆడించారు: మహమ్మద్ కైఫ్

వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు..

డబ్ల్యూపీఎల్ 2027 మ్యాచ్‌లకు కొత్త స్టేడియం వారణాసి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. వారణాసి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ పెద్దల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది జనవరి తొలి వారం నాటికి స్టేడియం అందుబాటులోకి వస్తుంది. ముంబైలోని బ్రాబోర్నె మైదానం, వడోదరలోని కోటంబి స్టేడియంతో పాటు వారణాసిలోనూ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. వేదికల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

BCCI Announces Women s Premier League 2027 Start Date Auction Set for October 28 in Kochi

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్‌సీబీ..

స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఆర్‌సీబీ రెండో సారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ మంధాన 41 బంతుల్లో 87 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగుల చేసి మంధానకు అండగా నిలిచింది. మంధాన 9 మ్యాచ్‌ల్లో 377 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకుంది.

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

Also Read

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

నాలుగు ఫైనల్స్‌లో ఢిల్లీకి నిరాశే..

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కూడా రెండు టైటిళ్లు గెలిచింది. ఆ జట్టు అరంగేట్ర సీజన్‌లో విజేతగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ 2023 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి టైటిల్ అందుకుంది. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌నే ఓడించి ఆర్‌సీబీ టైటిల్ అందుకుంది.

డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లోనూ ఢిల్లీపైనే గెలిచిన ముంబై ఇండియన్స్ రెండో టైటిల్ అందుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదృష్టం దక్కలేదు. వరుసగా నాలుగు సీజన్లలో ఆ జట్టు ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయింది.

Story first published: Wednesday, September 16, 2026, 20:00 [IST]
Other articles published on Sep 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+