Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తలపడే భారత టీ20 జట్టు ఇదే!

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెళ్లడించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భువనేశ్వర్ కుమార్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున సత్తా చాటిన భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోవాలని వచ్చిన డిమాండ్లను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే మరో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి మాత్రమ మొండి చెయ్యే ఎదురైంది. ఈ ఐదు టీ20ల సిరీస్ నుంచి కూడా జస్‌ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

IND vs WI: హెట్‌మైర్ రనౌట్‌పై దుమారం.. ఔటా? నాటౌటా? (వీడియో)

IND vs WI: హెట్‌మైర్ రనౌట్‌పై దుమారం.. ఔటా? నాటౌటా? (వీడియో)

వైభవ్‌కు చోటు..

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లతో పాటు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మాయంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గాయంతో జట్టుకు దూరమైన వరుణ్ చక్రవర్తీ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు.

BCCI Announces India T20I and India A Squads for New Zealand Tour Bhuvneshwar Kumar Returns

అక్టోబర్ 22 నుంచి ఈ ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22న తొలి టీ20, 24న రెండో టీ20, 27న మూడో టీ20, 30న నాలుగో టీ20, నవంబర్ 1న ఐదో టీ20 జరగనుంది. ఓవైపు టీ20 సిరీస్ జరగుతుండగానే మరోవైపు భారత్-ఏ జట్టు అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం భారత్-ఏ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్ట్ టీమ్ ప్రధాన ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం కల్పించింది.

భారత్-ఏ జట్టులో రాహుల్, పంత్..

న్యూజిలాండ్ కండిషన్స్‌కు అలవాటు పడేందుకు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అకీబ్ నబీ, ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, సాయి సుదర్శన్ ముఖేష్ కుమార్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 24-27 మధ్య తొలి అనధికారిక టెస్ట్, అక్టోబర్ 31-నవంబర్ 3 మధ్య రెండో టెస్ట్, నవంబర్ 10-26 మధ్య మూడో అనధికారిక టెస్ట్ జరగనుంది.

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

Also Read

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.

న్యూజిలాండ్ పర్యటనకు భారత్-ఏ జట్టు:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవిచంద్రన్ సమరణ్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అకీబ్ నబీ, ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, ముఖేష్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముఖేష్ కుమార్.

Story first published: Tuesday, October 6, 2026, 22:11 [IST]
Other articles published on Oct 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+