Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..ఆ నలుగురు రీఎంట్రీ!

అఫ్గానిస్థాన్ జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు పునరాగమనం చేశారు. అయితే ఈ నలుగురు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ పేర్కొంది. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో కొనసాగుతారని స్పష్టం చేసింది.

BCCI Announces India Squad for 3-Match T20I Series Against Afghanistan Bumrah Nitish Reddy and Harshit Rana Return

సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వగా.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రాక్టీస్‌లో అతని కాలికి గాయం కావడంతోనే ఎంపిక చేయలేదనే వాదన వినిపిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

నితీష్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వడంతో సూర్యాన్ష్ షెడ్గే‌ చోటు కోల్పోయాడు. ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా రీఎంట్రీతో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్ వంటి యువ పేసర్లకు అవకాశం లేకుండా పోయింది.

IND vs AFG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గుండు బాస్ ఔట్!

Also Read

IND vs AFG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గుండు బాస్ ఔట్!

సెప్టెంబర్ 13, 15, 17 తేదీ‌ల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గాన్‌లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆ జట్టు దుబాయ్, భారత్ వేదికగా తమ ఆతిథ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అఫ్గాన్‌తో టీ20 సిరీస్ భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్) శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా*, హర్షిత్ రాణా*, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్‌*.

Story first published: Tuesday, September 1, 2026, 18:23 [IST]
Other articles published on Sep 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+