IND vs AFG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గుండు బాస్ ఔట్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత గాయంతో జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. సొంతగడ్డపై సెప్టెంబర్ 13 నుంచి అఫ్గాన్‌తో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ తాజాగా హార్దిక్ పాండ్యాకు మరో గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కాలునొప్పితో బాధపడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ప్రాక్టీస్ చేస్తుండగా అతనికి కాలికి గాయమైనట్లు తెలిపింది. దాంతో అతను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడని వెల్లడించింది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. ఈనెలాఖర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్ 2026లో బరిలోకి దిగే అవకాశం ఉందని పేర్కొంది.
గుండు కొట్టించిన హార్దిక్ పాండ్యా..
ఫిట్‌నెస్‌పై తీవ్రంగా ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా తన నివాసాన్ని బెంగళూరుకు మార్చాడు. బీసీసీఐ సీఓఈ సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఫిట్‌గా మారేందుకు గత మూడు నెలలుగా తీవ్రంగా శ్రమించాడు. కానీ రీఎంట్రీ ఇచ్చే సమయంలో మళ్లీ గాయపడటం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
చిత్ర, విచిత్ర హెయిర్‌స్టైల్స్‌ను తరుచూ మార్చే హార్దిక్ పాండ్యా.. తాజాగా బోడి గుండుతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మీసాలు ఉంచి గుండు చేసుకున్నాడు. అతని న్యూ లుక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. హాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ తరహాలో లుక్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా గుండు బాస్ మళ్లీ గాయపడ్డాడా? అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్..
న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో భారత్, అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గాన్‌లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆ జట్టు దుయాబ్, భారత్ వేదికగా తమ ఆతిథ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సిరీస్ బరిలోకి దిగే జట్టును మరో రెండు రోజుల్లో అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించనుంది. గాయాలతో దూరమైన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధిస్తే పునరాగమనం చేయనున్నారు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా పేరును ఈ సిరీస్‌కు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

