Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క మ్యాచ్‌తో మారిపోయిన తలరాత.. హార్దిక్ లైఫ్ స్టోరీని పంచుకున్న ప్రియురాలు!

భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 33వ నంబర్ జెర్సీ ధరించే హార్దిక్ పాండ్యాకు ఈ మైలురాయి ఎంతో ప్రత్యేకమైనది. 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా.. భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ మ్యాచ్ విన్నర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భంలో హార్దిక్ ప్రియురాలు మహికా శర్మ సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యా జీవిత పోరాటాలు, క్రికెట్ ప్రయాణంపై రాసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

IND vs WI 3rd T20: ఓటమికి ప్రతీకారం.. విండీస్‌ను దెబ్బకొట్టే ఐదుగురు హీరోలు వీరే!

IND vs WI 3rd T20: ఓటమికి ప్రతీకారం.. విండీస్‌ను దెబ్బకొట్టే ఐదుగురు హీరోలు వీరే!

19 ఏళ్ల వరకు కేవలం బ్యాటర్‌గానే..
మహికా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హార్దిక్ పాండ్యా ప్రారంభ రోజుల గురించి వివరిస్తూ.. "19 ఏళ్ల వయసు వరకు హార్దిక్ పాండ్యా బరోడా జట్టు తరఫున కేవలం బ్యాటర్‌గా మాత్రమే నాలుగో స్థానంలో ఆడేవాడు. అపారమైన శక్తి, అత్యంత చురుకుదనం ఉన్న హార్దిక్ పాండ్యాకు తనలోని సామర్థ్యాన్ని వెలికితీసేందుకు క్రికెట్ ఓ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ.. స్టేడయంలో ఆట ద్వారానే తనను తాను నిరూపించుకోవాలని తపించేవాడు" అని మహీకా శర్మ పేర్కొన్నారు.

Hardik Pandya Turns 33 Girlfriend Mahieka Sharma Shares Inspiring Story on His Birthday

తోటి ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం బౌలింగ్
హార్దిక్ పాండ్యా క్రమశిక్షణ, కష్టం గురించి ఆమె చెబుతూ.. తాను బ్యాటింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా హార్దిక్ స్టేడియంలోనే గడిపేవాడని వివరించారు. తన తోటి బౌలర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం కోసం ఫ్రీగా బౌలింగ్ చేసేవాడు. ఆ సమయంలో ఓ సీనియర్ కోచ్ హార్దిక్ వేస్తున్న బౌలింగ్ స్టైల్‌ను, వేగాన్ని గమనించాడు. అప్పటివరకు హార్దిక్ పాండ్యాను కేవలం బ్యాటర్‌గానే చూసిన ఆ కోచ్.. అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

భారత్‌తో పోరుకు కివీస్ సిద్ధం: వన్డే జట్టు ప్రకటన... స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

Also Read

భారత్‌తో పోరుకు కివీస్ సిద్ధం: వన్డే జట్టు ప్రకటన... స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల విధ్వంసం
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్‌గా ఓ మ్యాచ్‌లో బరిలోకి దింపారు. ఆ అరంగేట్ర మ్యాచ్‌లోనే హార్దిక్ 5 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విశేషమేమిటంటే.. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా వద్ద సరైన బౌలింగ్ షూస్ కూడా లేవని మహీకా శర్మ వెల్లడించారు. ఆ ఒక్క మ్యాచ్ హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రయాణాన్నే మలుపు తిప్పింది.

ఐపీఎల్ ఎంట్రీ నుంచి భారత జట్టు వరకు..
ఆ మ్యాచ్ జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా ఎంపిక చేసుకుంది. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కేవలం 6 నెలల వ్యవధిలోనే హార్దిక్ పాండ్యా భారత జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా జీవిత ప్రయాణాన్ని మాటల్లో వర్ణించడం కష్టమని, అతడి అసలైన గుర్తింపు మాటల్లో కాకుండా స్టేడియంలో చూపే ఆటతీరులోనే ఉందని మహీకా శర్మ కొనియాడారు.

Story first published: Sunday, October 11, 2026, 13:24 [IST]
Other articles published on Oct 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+