మా వాళ్లు కక్కుర్తిగాళ్లు.. కృత్రిమ కొరతపై మండిపడ్డ బంగ్లా క్రికెటర్

ఢాకా: డబ్బులకు కక్కుర్తిపడే వ్యాపారవేత్తలు కరోనా వైరస్ కంటే ప్రమాదమని బంగ్లాదేశ్ బౌలర్ రూబెల్ హుస్సేన్ మండిపడ్డాడు. ప్రజల భయాన్ని ఆసరాగా తీసుకుని మాస్కులు, శానిటైజర్ల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ప్రజల అవకాశాన్నే ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.

దయలేని జాతి..
దీనిపై స్పందించిన రూబెల్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా వ్యాపారులపై ధ్వజమెత్తాడు. తమది అత్యాశ, నిర్దయతో కూడిన జాతి అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ మహమ్మారితో చైనా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతే అక్కడి వ్యాపారులు మాస్కుల ధరను తగ్గించారు. ఎందుకంటే వాళ్లు మనుషులు. కానీ మా దేశంలో అలా కాదు. కరోనా గురించి విన్ననాటి నుంచి ఐదు టాకాల ధర గల మాస్కు ధర 50 టాకాలకు పెరిగింది. 20 టాకాల ధర గల మాస్కును 100 లేదా 150 టాకాలకు అమ్ముతున్నారు. ఎందుకంటే మేం అత్యాశపరులం.'అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ బంగ్లా బౌలర్ ధ్వజమెత్తాడు.
భేష్ వార్న్.. నువ్వు మా క్రికెటర్లలా కాదులే!!

అత్యాశ వ్యాపారులారా సిగ్గుచేటు..
కృతిమ కొరత పుట్టిస్తున్న అత్యాశ వ్యాపారులే కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని రూబెల్ హుస్సెన్ మండిపడ్డాడు. ‘కఠిన సమయాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన హీరోలను నేను గుర్తుచేసుకుంటా. వారి ప్రయాత్నాల వల్లే మనకు ఈ స్వేఛ్చ లభించింది. కానీ ఏం లాభం. సంక్షోభ పరిస్థితులు తలెత్తిన ఈ సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. మాస్కులు, శానిటైజర్లు, కిరాణ సరకులు ధర పెరిగిపోయింది. దురాశతో లాభాల కోసం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిజంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కంటే వీళ్లే ప్రమాదకరం'అంటూ రూబెల్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.
యువీ రక్తపు వాంతుల సెంచరీ గుర్తుందా?

బంగ్లాలో 24 కేసులు..
ఇక బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇద్దరు మృతి చెందారు. ఇందులో ముగ్గురు కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మరణాలు సంభవించాయి. రెండున్నర లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు. ఇక 88వేల మంది కోలుకున్నారు. భారత్‌తో కరోనా బాధితుల సంఖ్య 250కి చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications