For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భేష్ వార్న్.. నువ్వు మా క్రికెటర్లలా కాదులే!!

Shane Warnes Distillery Stops Gin Production To Make Hand Sanitiser

సిడ్నీ: 'చేతులు కడుక్కోండి.. ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్భంధంలోనే ఉండండి.. తగు జాగ్రత్తలు పాటించండి'అంటూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో రెండు మూడు రోజులుగా స్టార్ క్రికెటర్లు అందరూ ప్రజల‌కు చెబుతున్న మాటలు.. చేస్తున్న సూచనలు ఇవి.

కోట్లకు కోట్లు ఆర్జించే ఈ ఆటగాళ్లు.. పైసా ఖర్చులేకుండా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడుతూ కరోనాను అరికడుదామని పిలుపునిస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్ మాత్రం వీరిలా కాకుండా ప్రజల క్షేమం పట్ల తన బాధ్యతను చాటుకున్నాడు.

ఆల్కహాల్ ఉత్పత్తిని ఆపేసి..

ఆల్కహాల్ ఉత్పత్తిని ఆపేసి..

కోట్ల రూపాయాల ఆదాయాన్ని తెచ్చే తన ఆల్కాహలిక్ కంపెనీలో మధ్యం ఉత్పత్తిని ఆపేసి.. కరోనాను అరికట్టేందుకు సానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. అవును ఇప్పటికే తనకు వాటా ఉన్న 'సెవెన్ జీరో ఎట్ జిన్' అనే సంస్థలో 70 శాతం ఆల్కహాల్‌తో శానిటైజర్‌ను తయారిని ప్రారంభించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని రెండు ఆసుపత్రులకు ఈ శానిటైజర్స్‌ను కూడా అందిస్తున్నారు. శానిటైజర్స్ కొరత ఉండకుండా వార్న్ చేస్తున్న పనిని ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

యువీ రక్తపు వాంతుల సెంచరీ గుర్తుందా?

సాయం చేయడం సంతోషంగా ఉంది..

ఈ విషయాన్ని అతనే తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘ఆస్ట్రేలియన్లందరికీ సవాల్‌ విసురుతున్న సమయమిది. మన ప్రాణాలను రక్షించుకోవటానికి మనమంతా ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది'అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇక శానిటైజర్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తన 708 కంపెనీ నిర్ణయం పట్ల వార్న్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘708 తీసుకున్న ఈ నిర్ణయంతో సంతోషంగా ఉన్నాను. సహాయం చేయడం చాలా గొప్ప పని. మీరు కూడా మీకు తోచిన సాయం చేయండి'అంటూ వార్న్ ట్వీట్ చేశాడు.

సూపర్ వార్న్..

ఇక వార్న్ కంపెనీ చేస్తున్న సాయంపై ఆస్ట్రేలియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. మీ అభిమానులమైనందకు గర్విస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక భారత అభిమానులు కూడా వార్న్‌ను కొనియాడుతున్నారు. ‘మా క్రికెటర్లలా కాకుండా ప్రజల క్షేమం కోసం నీ వంతు సహాయం చేస్తున్నావ్..' అంటూ కితాబిస్తున్నారు.

కార్చిచ్చు బాధితుల కోసం..

కార్చిచ్చు బాధితుల కోసం..

ఇక ఆస్ట్రేలియాను అతలాకుతలం చేసిన కార్చిచ్చు.. ఎందరికో కూడు గూడు లేకుండా చేసింది. వీరి కోసం కూడా వార్న్ ముందుకొచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తన బ్యాగీ గ్రీన్ టోపీని వేలం వేయగా వచ్చిన డబ్బు (రూ. 7,15,97,483)ను విరాళంగా ప్రకటించాడు.

Story first published: Friday, March 20, 2020, 18:30 [IST]
Other articles published on Mar 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+