Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన ప్రదర్శనతో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇటీవల పేలవమైన ఫామ్‌తో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బాబర్ ఆజం.. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 7 వేల పరుగుల మార్కును దాటి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

21 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. 9వ స్థానంలో వచ్చి 9 సిక్సులు

21 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. 9వ స్థానంలో వచ్చి 9 సిక్సులు

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 7 వేల పరుగుల మైలురాయి
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం అత్యంత సమయోచితంగా, దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 103 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా బాబర్ ఆజం మొత్తం అంతర్జాతీయ పరుగులు 7,029కి చేరాయి. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో మిస్బా-ఉల్-హక్(7,392 పరుగులు) తర్వాత కెప్టెన్‌గా 7 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బాబర్ ఆజం నిలిచాడు.

Pakistan Captain Babar Azam Creates Double Record in Edgbaston Test Against England crossing 7 000 Runs

ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు
ఈ మ్యాచ్ బాబర్‌కు రికార్డుల పంట పండించింది. కెప్టెన్‌గా 7 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటడానికి కొద్ది క్షణాల ముందే, బాబర్ ఆజం టెస్ట్ క్రికెట్లో కెప్టెన్‌గా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీనితో టెస్టుల్లో కెప్టెన్‌గా 2 వేల పరుగులు చేసిన ఐదో పాకిస్తాన్ ఆటగాడిగా ఘనత సాధించాడు. గతంలో మిస్బా-ఉల్-హక్, ఇమ్రాన్ ఖాన్, ఇంజమామ్-ఉల్-హక్ , జావేద్ మియాందాద్ వంటి దిగ్గజాలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

Also Read

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

ప్రపంచ వేదికపై గుర్తింపు
బాబర్ ఆజం మిస్బా-ఉల్-హక్ కంటే 26 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి అత్యంత వేగంగా ఈ 7,000 పరుగుల మార్కును చేరుకోవడం విశేషం. ప్రపంచ క్రికెట్లో కెప్టెన్‌గా 7 వేల పరుగులు చేసిన 17వ ఆటగాడిగా బాబర్ ఆజం గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ దశాబ్ధంలో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన విషయమై బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్‌లను అధిగమించాడు. ఈ 76 పరుగుల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ద్వారా తాను ఇప్పటికీ పాకిస్తాన్ బ్యాటింగ్‌కు ప్రధాన వెన్నెముకనని బాబర్ ఆజం నిరూపించుకున్నాడు.

Story first published: Saturday, September 12, 2026, 12:07 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+