Asian Games 2026: భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేతగా నిలిచేది ఎవరంటే?
ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో దాయదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మెరుగైన ఐసీసీ ర్యాంకుతో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్, పాక్.. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌లు ఆడలేదు.
హాంగ్ కాంగ్ X పాకిస్థాన్, భారత్ X అఫ్గానిస్థాన్, నేపాల్ X శ్రీలంక, బంగ్లాదేశ్ X మలేసియా నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్, బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది.

ఫైనల్‌కు వర్షం ముప్పు..?
శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే భారత్‌కు స్వర్ణ పతకం, పాకిస్థాన్‌కు సిల్వర్ మెడల్ దక్కనుంది. ఎందుకంటే పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన ఐసీసీ ర్యాంకులో ఉంది. ఒకవేళ మ్యాచ్ జరిగినా భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ పటిష్టంగా ఉంది. సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. అదే జోరు కొనసాగించి పాకిస్థాన్‌ను మట్టికరిపించాలని శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది.
బరిలో వైభవ్ సూర్యవంశీ..?
భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ నెట్‌వర్క్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లైవ్‌లో ఈ మ్యాచ్ ప్రతక్ష్య ప్రసారం చూడవచ్చు. శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ విభిన్నమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.
ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీని ఆడించి.. ఏకైక పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను బరిలోకి దించింది. ఈ కాంబినేషన్ ఆశించిన ఫలితాన్ని అందించింది. పాకిస్థాన్‌తో ఫైనల్లో కూడా ఇదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. భారత్, పాక్ ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య కాంస్య పోరు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


