ICC Women's T20 World Cup: సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. భారత్ ప్రత్యర్థి ఎవరంటే?

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్ మహిళలతో సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 4 పరుగులతో విజయం సాధించింది. ఫలితంగా గ్రూప్-'ఎ'లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఇక వరుస విజయాలతో గ్రూప్-'ఎ' టాపర్‌గా ఇప్పటికే భారత్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే.

బెత్ మూనీ హాఫ్ సెంచరీ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. బెత్ మూనీ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో రాచెల్ హెనెస్ (8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 19 నాటౌట్) మెరుపులు మెరిపించింది. ఇక కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (17 బంతుల్లో 4 ఫోర్లు 21), ఎల్లిస్ పెర్రీ (15 బంతుల్లో 2 ఫోర్లు 21) కూడా ఫర్వాలేదనపించారు. ప్రత్యర్థి బౌలర్లలో అన్నా పీటర్సన్ రెండు వికెట్లు తీయగా.. అమెలియా కెర్, లై కాస్సెరెక్, జెన్సెన్ తలో వికెట్ తీశారు.
మైదానంలో కోహ్లీ ప్రవర్తనపై విలియమ్సన్ ఏమన్నాడంటే?

చివరి బంతికి సిక్స్ కొట్టినా..
అనంతరం 156 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ సోఫి డివైన్ (31), మార్టిన్(37 నాటౌట్ ) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు బ్యాటర్స్ కేవలం 15 పరుగులు చేశారు. తొలి మూడు బంతులు సింగిల్స్ తీసిన న్యూజిలాండ్ బ్యాటర్స్ నాలుగో బంతికి రెండు పరుగులు రాబట్టారు. ఇక చివరి రెండు బంతుల్లో మార్టిన్ వరుసగా 4,6 కొట్టినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగన్ స్కట్, జార్జియా మూడేసి వికెట్లు తీయగా.. జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టింది. మూడు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జార్జియాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
ఏమనుకుంటున్నావ్? అంటూ జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదం.. !!

గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా..
ఇక గ్రూప్-బి నుంచి 'హ్యాట్రిక్' విజయంతో సౌతాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ.. మంగళవారం వెస్టిండీస్-సౌతాఫ్రికా మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. వెస్టిండీస్‌ను సఫారీలు ఓడిస్తే గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలవనున్నారు. అప్పుడు భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కానుంది. ఓడితే మాత్రం హర్మన్ ప్రీత్ సేన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications