Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఓటములకు గౌతమ్ గంభీరే కారణం: షేన్ వాట్సన్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓటములను ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా నిలకడలేమి ప్రదర్శనకు ప్రధాన కారణం గంభీరేనని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తరుచూ మార్పులు చేయడం వల్లే టీమిండియా స్థిరత్వాన్ని కోల్పోతుందన్నాడు.

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు నిలకడగా రాణించలేకపోవడానికి ప్రధాన కారణం... బ్యాటింగ్ ఆర్డర్‌‌లో తరుచూ మార్పులు చేయడమే. ఆటగాళ్లను నిరంతరం మార్చడం వల్ల జట్టు స్థిరత్వాన్ని కోల్పోతుంది. బ్యాటింగ్ ఆర్డర్ లేదా ఆటగాళ్లు మార్పులు ఎక్కువగా ఉన్నప్పుడు జట్టు నిలకడగా రాణించడం చాలా కష్టం. భారత్ వరుసగా విజయాలు సాధించకపోవడానికి కారణం ఇదే అని నా అభిప్రాయం.

Shane Watson Blames Head Coach Gautam Gambhir For India s Inconsistent Performance

గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లను, బ్యాటింగ్ స్థానాలను మరీ ఎక్కువగా మారుస్తున్నారనిపిస్తోంది. జట్టులో కొంత నిలకడ ఉండటం చాలా అవసరం. టీమిండియా గనుక ప్లేయర్లకు వరుసగా అవకాశాలిచ్చి ఒకే కాంబినేషన్‌ను కొనసాగిస్తే... ప్రపంచ క్రికెట్‌లో వారిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. భారత్‌ను ఓడించడం చాలా కష్టమవుతుంది'అని షేన్ వాట్సన్ తెలిపాడు.

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో ఆధిపత్యం చెలయించిన భారత్.. టెస్ట్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్ హయాంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026ను గెలిచింది. కానీ టెస్ట్‌ల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కోల్పోయింది.

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

Also Read

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

ప్రస్తుతం గంభీర్ ముందు న్యూజిలాండ్ పర్యటన అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. న్యూజిలాండ్ గడ్డపై 2009 నుంచి భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. చివరిసారిగా 1-0తో సిరీస్ గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిస్తేనే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే గల్లంతవుతాయి.

Story first published: Saturday, October 10, 2026, 8:30 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+