ఉత్కంఠగా సౌతాఫ్రికా X ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. ఆఖరి రోజు గెలుపు ఎవరిదో..?
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను విజయం ఊరిస్తోంది. డర్బన్ వేదికగా ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 421 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 102 పరుగులు చేసింది.
క్రీజులో ఎయిడెన్ మార్క్(45 బ్యాటింగ్), వియాన్ మల్డర్(5 బ్యాటింగ్) ఉన్నారు. డేవిడ్ బెడింగమ్(46) పర్వాలేదనిపించినా.., ర్యాన్ రికెల్టన్(2), కెప్టెన్ టెంబా బవుమా, ట్రిస్టన్ స్టబ్స్ తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హెజిల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మ్యాట్ రేన్‌షా తలో వికెట్ తీసారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 319 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియాకు 4 వికెట్లు కావాలి.

మ్యాట్ రేన్‌షా విధ్వంసంతో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మ్యాట్ రేన్‌షా(397 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 190) అసాధారణ శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/68), అన్రిచ్ నోర్జ్(2/88) రెండు వికెట్లు పడగొట్టాడు. సిమన్ హర్మర్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్‌హామ్(49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లయన్ రెండేసి వికెట్లు తీయగా..ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యూ వెబ్‌స్టర్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆసీస్ 314/6 డిక్లేర్డ్..
106 పరుగుల భారీ ఆధిక్యంతో ఆస్ట్రేలియా 58 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగుల వద్ద డిక్లెర్డ్ చేసింది. మరోసారి మ్యాట్ రేన్‌షా(99 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, సిమన్ హార్మర్ తలో వికెట్ పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 390 ఆలౌట్( మ్యాట్ రేన్‌షా 190)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 314/6 డిక్లేర్డ్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 102/4
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


