Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!
ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌కు అదృష్టం వరించింది. ఒక మ్యాచ్ ఆడకుండా ఆ జట్టు నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 మధ్య ఆసియా గేమ్స్‌కు తెరలేవనుంది. ఈ టోర్నీలో భాగంగా మహిళల క్రికెట్ మ్యాచ్‌లు ముందే ప్రారంభమయ్యాయి.
క్రికెట్ గ్రౌండ్స్ కొరత నేపథ్యంలో మహిళల మ్యాచ్‌లు ముందుగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల విభాగంలో బంగ్లాదేశ్, చైనా, భారత్, జపాన్, మలేసియా, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్ తలపడుతున్నాయి.

అయితే నేడు(గురువారం) బంగ్లాదేశ్, చైనా మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంక్ సాధించిన బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ లెక్కన బంగ్లాదేశ్ నేరుగా సెమీఫైనల్ చేరింది. మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ కలిగిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
రెండో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్, థాయ్‌లాండ్ జట్లు ఆడుతుండగా.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా, శ్రీలంక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్, జపాన్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ భారత్ సెమీస్ చేరితే బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20న ఈ సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌ను జపాన్‌తో సెప్టెంబర్ 18న ఆడనుంది. ఆసియా కప్ 2026 గెలిచి జోరుమీదున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. అదే ఊపులో ఆసియా గేమ్స్‌లో కూడా విజేతగా నిలవాలని భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


