Asian Games 2026: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్!
టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో మంధాన ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేసింది.
ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డ్‌ను బద్దలు కొట్టింది. స్మృతి మంధాన ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో 4761 పరుగులు చేయగా.. సుజీ బేట్స్ 4758 పరుగులతో రెండో స్థానంలో ఉంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(4287), శ్రీలంక సారథి చమరి ఆటపట్టు(4282), న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్(3817) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా స్మృతి మంధాన రికార్డ్ సాధించింది. పురుషుల క్రికెట్‌లో ఈ ఘనత రోహిత్ శర్మ పేరిట ఉంది. ఇదే నెలలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను స్మృతి మంధాన అధిగమించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధాన నిలిచింది. మూడు ఫార్మాట్లలో కలిపి మంధాన 10,868 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(33 బంతుల్లో 6 ఫోర్లతో 40) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు.
ఇన్నింగ్స్ ఆఖరి బంతికి షెఫాలీ వర్మ సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఫైనల్ చేరుతుంది. దాంతో సిల్వర్ మెడల్ ఖాయమవుతోంది. ఫైనల్లో శ్రీలంకతో హర్మన్‌సేన తలపడాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


