Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: స్మృతి మంధాన విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

ఆసియా గేమ్స్ 2026లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్లో భారత మహిళల జట్టు 217 పరుగుల భారీ లక్ష్యాన్నినమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), రిచా ఘోష్(22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది.

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డ్‌!

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డ్‌!

షెఫాలీ వర్మ(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) కూడా దూకుడుగా ఆడింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కావిషా దిల్‌హరి, చాముడి ప్రబోద తలో వికెట్ తీసారు.

Asian Games 2026 Smriti Mandhana 79 Richa Ghosh s 49 Help India Post 216 3 vs Sri Lanka In Final

మంధాన, షెఫాలీ విధ్వంసం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ పోటాపోటిగా బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఈ క్రమంలో స్మృతి మంధాన 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. షెఫాలీ వర్మ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. భారీ షాట్ ఆడే క్రమంలో చాముడి ప్రబోద బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs SL: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఊచకోత..!

Also Read

IND vs SL: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఊచకోత..!

షెఫాలీ వర్మ ఔటైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మంధాన చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నిధానంగా ఆడినా.. మంధాన భారీ షాట్స్ ఆడింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్(19) క్యాచ్ ఔట్‌‌గా వెనుదిరగగా.. సెంచరీ దిశగా సాగిన మంధాన(79)ను సుగందిక కుమారి ఔట్ చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను 200 ధాటించింది. 3 భారీ సిక్స్‌లతో ఆకట్టుకుంది. భారతి ఫుల్మాలితో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా..53 పరుగులు జోడించింది.

Story first published: Tuesday, September 22, 2026, 12:12 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+