Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: భారత్ శుభారంభం.. 5 ఓవర్లలోనే మ్యాచ్ ఖతమ్!

ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం ఆతిథ్య జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జపాన్ మహిళల టీమ్ 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. తెలుగు తేజం శ్రీచరణి(4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెఫాలీ వర్మ(2/13)) రెండు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

అనంతరం భారత్ 5 ఓవర్లలోనే 2 వికెట్లకు 59 పరుగులు చేసి గెలుపొందింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్(6 బంతుల్లో 2 ఫోర్లతో 12) దూకుడుగా ఆడింది. ఆదివారం జరిగే రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుండగా.. శ్రీలంకతో పాకిస్థాన్ ఆడనుంది.

Asian Games 2026 Shree Charani 4 Wicket Haul Helps India Beat Japan by 8 Wickets Reach Semifinal

బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు అర్హత సాధించింది. చైనాతో ఆడాల్సిన క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో మెరుగైన ర్యాంక్ కలిగిన బంగ్లాదేశ్ టోర్నీలో ముందడుగు వేసింది.

శ్రీలంకపై పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధిస్తే ఫైనల్లో దాయాదుల పోరు చూడవచ్చు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 మధ్య జరగాల్సింది. కానీ మహిళల క్రికెట్ మ్యాచ్‌లు షెడ్యూల్‌కు ముందే ప్రారంభమయ్యాయి.

Asian Games 2026: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ విజయం!

Also Read

Asian Games 2026: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ విజయం!

క్రికెట్ గ్రౌండ్స్ కొరత నేపథ్యంలో మహిళల మ్యాచ్‌లు ముందుగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల విభాగంలో బంగ్లాదేశ్, చైనా, భారత్, జపాన్, మలేసియా, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్‌ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నాయి.

Story first published: Friday, September 18, 2026, 13:36 [IST]
Other articles published on Sep 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+