Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ విజయం!

ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో పాకిస్థాన్ మహిళల క్రికెట్ టీమ్ శుభారంభం చేసింది. థాయిలాండ్‌తో గురువారం హోరాహోరీగా సాగిన క్వార్డర్ ఫైనల్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన థాయిలాండ్.. నిర్ణీత 11 ఓవర్లలో 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. నన్నపట్(38 బంతుల్లో 7 ఫోర్లతో 49) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా(2/22) రెండు వికెట్లు తీయగా.. నష్రా సంధు ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం పాకిస్థాన్ మహిళల టీమ్ 10.4 ఓవర్లలో 7 వికెట్లకు 92 పరుగులు చేసి గెలుపొందింది. జుల్ఫికర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), ఫతిమా సనా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు.ఈ విజయంతో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 20న జరిగే సెమీఫైనల్లో పాకిస్థాన్ తలపడనుంది.

Asian Games 2026 Fatima Sana Stars as Pakistan Women Beat Thailand by 3 Wickets to Reach Semis

వాస్తవానికి ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 మధ్య జరగాల్సింది. కానీ మహిళల క్రికెట్ మ్యాచ్‌లు షెడ్యూల్‌కు ముందే ప్రారంభమయ్యాయి. క్రికెట్ గ్రౌండ్స్ కొరత నేపథ్యంలో మహిళల మ్యాచ్‌లు ముందుగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆ తర్వాత పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల విభాగంలో బంగ్లాదేశ్, చైనా, భారత్, జపాన్, మలేసియా, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్‌ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్‌తో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నాయి.

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

Also Read

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

అయితే నేడు(గురువారం) బంగ్లాదేశ్, చైనా మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. దాంతో చైనా కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ లెక్కన బంగ్లాదేశ్ నేరుగా సెమీఫైనల్ చేరింది. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా, శ్రీలంక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్, జపాన్ జట్లు తలపడనున్నాయి.

Story first published: Thursday, September 17, 2026, 15:58 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+