Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: బంగ్లాపై భారీ విజయం.. భారత్‌కు పతకం ఖాయం!

ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 114 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్ చేరిన భారత్.. కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.

Asian Games 2026: షెఫాలీ వర్మ సెంచరీ.. భారత్ భారీ స్కోర్!

Asian Games 2026: షెఫాలీ వర్మ సెంచరీ.. భారత్ భారీ స్కోర్!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(33 బంతుల్లో 6 ఫోర్లతో 40) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు.

Asian Games 2026 India Beat Bangladesh by 8 Wickets to Reach Final and Secure a Medal

అనంతరం బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజాయాన్ని మూటగట్టుకుంది. దిలార అక్తర్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో నందని శర్మ(3/25), దీప్తి శర్మ(3/7) మూడేసి వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. తెలుగు తేజం శ్రీచరణి(2/7) రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గాడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసారు.

Asian Games 2026: భారత్‌కు తొలి పతకం.. షూటింగ్‌తో షురూ!

Also Read

Asian Games 2026: భారత్‌కు తొలి పతకం.. షూటింగ్‌తో షురూ!

మంగళవారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణం.. ఓడితే రజతం భారత్‌కు దక్కుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన భారత్ హాట్ ఫేవరేట్‌గా ఈ ఫైనల్ బరిలోకి దిగనుంది. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. కాంస్య పోరులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

Story first published: Sunday, September 20, 2026, 13:49 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+