Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: షెఫాలీ వర్మ సెంచరీ.. భారత్ భారీ స్కోర్!

ఆసియా గేమ్స్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ(49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగింది. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.

షెఫాలీ వర్మతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్(33 బంతుల్లో 6 ఫోర్లతో 40) రాణించడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్మృతి మంధాన(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) దూకుడుగా ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు.

Asian Games 2026 Shafali Verma Century Helps India Post 195 4 Against Bangladesh in Semi-Final

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఈ ఇద్దరి దూకుడుతో పవర్ ప్లేలోనే భారత్ 72 పరుగులు చేసింది.

అయితే పవర్ ప్లే ఆఖరి బంతికి స్మృతి మంధాన క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయి అందుకుంది.

గునాలమ్ కమలిని(3) విఫలమైనా..కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి షెఫాలీ వర్మ చెలరేగింది. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షెఫాలీ.. మరో 25 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకుంది. మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం హార్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది.

పవర్ హిట్టర్ రిచా ఘోష్(2) నిరాశపర్చడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి షెఫాలీ వర్మ సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఫైనల్ చేరుతుంది. దాంతో సిల్వర్ మెడల్ ఖాయమవుతోంది. ఫైనల్లో శ్రీలంకతో హర్మన్‌సేన తలపడాల్సి ఉంటుంది.

Story first published: Sunday, September 20, 2026, 12:17 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+