Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026 టోర్నీకి గంభీర్ దూరం.. టీమిండియాను నడిపించేది అతనే!

ఆసియా గేమ్స్‌ 2026‌ టోర్నీకి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ టోర్నీలో భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ సీఓఈ డైరెక్టర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడని గురువారం ప్రకటించింది.

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్‌ సిబ్బంది ఉన్నారు.

రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌, లక్ష్మణ్‌కు పిలుపు!

రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌, లక్ష్మణ్‌కు పిలుపు!

ఆసియా గేమ్స్‌ ‌నుంచి హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు విశ్రాంతి ఇచ్చారు. అప్‌కమింగ్ సిరీస్‌ల కోసం గంభీర్‌కు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ వైట్‌బాల్‌ సిరీస్‌ ఆడనుంది. గంభీర్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ జట్టును పర్యవేక్షించనున్నాడు. గంభీర్ సపోర్ట్ టీమ్ కూడా ఈ ఆసియా గేమ్స్‌కు దూరంగా ఉండనుంది.

Asian Games 2026 Gautam Gambhir Won t Travel as New Coaching Staff Is Announced

వీవీఎస్ లక్ష్మణ్‌కు సునీల్‌ జోషి, హృషీకేశ్‌ కనిత్కర్‌, శుభదీప్‌ ఘోష్‌ సపోర్ట్ స్టాఫ్‌గా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్‌ ముజుందార్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్‌ భారత జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌ అనంతరం గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వగా.. లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు.

ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. చైనా వేదికగా 2022 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించగా.. మహిళల జట్టును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నడిపించింది.

మరోవైపు ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్‌ క్రికెట్‌ అసోసియేషన్ సీఈవో నవోకి అలెక్స్‌ మియాజీ కీలక వివరణ ఇచ్చారు. గదుల కొరత ఉన్నప్పటికీ పాల్గొనే జట్లకు హోటల్‌ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.

శ్రేయస్ అయ్యర్‌కు చెక్.. గంభీర్ బిగ్ ప్లాన్!

Also Read

శ్రేయస్ అయ్యర్‌కు చెక్.. గంభీర్ బిగ్ ప్లాన్!

సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 3 వరకు టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. జట్లు కోరుకుంటే తమకు నచ్చిన వసతిని స్వయంగా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉందని మియాజీ చెప్పారు. సరైన డ్రెస్సింగ్ రూమ్స్ లేకపోవడంతో పాటు వాష్ రూల్స్ అధ్వాన్నంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వసతులపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

Story first published: Thursday, September 3, 2026, 18:52 [IST]
Other articles published on Sep 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+