Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌కు చెక్.. గంభీర్ బిగ్ ప్లాన్!

ODI World Cup: రాబోయే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా యాజమాన్యం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ప్రత్యామ్నాయ ప్రణాళికపై కసరత్తు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు. ఈ రేసులో తిలక్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. టాప్ సిక్స్‌లో శ్రేయస్ అయ్యర్‌కు బ్యాకప్‌గా తిలక్‌ను సిద్ధం చేయాలని జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు భావిస్తున్నారు.ఇప్పటివరకు భారత్ తరఫున కేవలం 5 వన్డేలు ఆడి 68 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. తిలక్ వర్మలో ఉన్న ప్రతిభను గుర్తించిన జట్టు యాజమాన్యం అతడిని ప్రపంచ కప్ ప్రణాళికల్లో కీలక భాగస్వామిగా మార్చాలని భావిస్తోంది.

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

ఆల్‌రౌండ్ సవాళ్లు.. తిలక్ వర్మ పాత్ర
ప్రస్తుతం భారత జట్టులో ఆల్‌రౌండర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టాప్-6లో బ్యాటింగ్ చేస్తూనే కనీసం 4 నుంచి 5 ఓవర్లు వేయగల ఆటగాడి అవసరం జట్టుకు ఉంది. ఇటీవలి కాలంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను పై స్థానాల్లో ఆడించాల్సి రావడం వల్ల ఏర్పడిన అసమతుల్యతను నివారించేంకుదు.. తిలక్ వర్మలోని ఆఫ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భావిస్తున్నారు. అంతే కాకుండా ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ వర్మ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు ఎంతో అవసరమైన సమతుల్యతను కూడా అందిస్తాడు.

Gautam Gambhir ODI World Cup Plan Tilak Varma Emerges as Backup Option for Shreyas Iyer Full Details

భారత సెలెక్టర్లు ఇప్పుడు బ్యాటర్లను అవసరాన్ని బట్టి వేర్వేరు స్థానాల్లో ఆడించడం కంటే వారి సహజ పాత్రలలో తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు. గతేడాది రుతురాజ్ గైక్వాడ్‌ను నంబర్ 4 స్థానంలో ఆడించారు. అతను రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కూడా సాధించాడు, కానీ అప్పటి నుండి వన్డే జట్టులో కనిపించలేదు. ఒక ఆటగాడు ఓపెనర్‌గా నిలదొక్కుకుంటే అతడిని అదే పాత్రలో తీర్చిదిద్దడం ఉత్తమమని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ కారణంగానే దేవదత్ పడిక్కల్‌ను కూడా వన్డే జట్టులోకి తొందరపాటుగా తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు.

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

Also Read

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండంలో జరుగుతోంది. కాబట్టి జట్టు యాజమాన్యం అక్కడి పరిస్థితుల ఆధారంగా ప్రత్యామ్నాయాలను రూపొందించాలని చూస్తోంది. ఫాస్ట్ బౌలింగ్, బౌన్స్‌ను ఎదుర్కోవడంలో బ్యాటర్ల సామర్థ్యం కూడా జట్టు ప్రణాళికలో ఒక కీలక భాగం. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. షార్ట్ పిచ్ బంతులపై శ్రేయస్ అయ్యర్ బలహీనత గురించి కూడా జట్టు యాజమాన్యంలో చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ కెరీర్ చివరి దశలో ఉండగా, ప్రపంచ కప్ నాటికి కేఎల్ రాహుల్‌కు 35 ఏళ్లు దాటిపోతాయి.

రవీంద్ర జడేజాను కూడా జట్టులో ఖచ్చితమైన ఎంపికగా పరిగణించడం లేదు. ఫిట్‌నెస్ సమస్యలు అతని ఫీల్డింగ్‌ను కూడా ప్రభావితం చేశాయి. అందువల్ల, సెలెక్టర్లు ఈ పెద్ద టోర్నమెంట్‌కు ముందే కొందరు ఆటగాళ్లను పూర్తిగా సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అక్టోబర్‌లో న్యూజిలాండ్ పర్యటనతో ప్రపంచ కప్ సన్నాహాలు మరింత స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి.

అంతకుముందు సెప్టెంబర్ 27న ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు పలువురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో భారత బలమైన టీ20 జట్టు ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్తుంది. అందువల్ల వెస్టిండీస్ సిరీస్‌కు యువ ఆటగాళ్లు, బ్యాకప్ ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ , తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ కూడా అందుబాటులో ఉండరు. అందువల్ల సెలెక్టర్లు అదనపు వికెట్ కీపర్‌ను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

Story first published: Sunday, August 30, 2026, 14:00 [IST]
Other articles published on Aug 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+