Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కోచ్ పదవి.. ముందు నా పెళ్లాం పర్మీషన్ ఇవ్వాలి: ఆశిష్ నెహ్రా

టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ప్రస్తుతం తనకు ఎలాంటి ఆసక్తి లేదని మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. భవిష్యత్తులో ఈ విషయంపై ఆలోచిస్తానని స్పష్టం చేశాడు. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే ముందు తన సతీమణి పర్మీషన్ తీసుకోవాలని, లేదంటే విడాకులు ఇచ్చేస్తుందని నవ్వులు పూయించాడు.

Ashish Nehra: ఆ విషయంలో సెలెక్టర్లకు తలనొప్పి తప్పదు!

Ashish Nehra: ఆ విషయంలో సెలెక్టర్లకు తలనొప్పి తప్పదు!

ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌పై తరుచూ విమర్శలొస్తున్నాయి. అతను తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవడంతో పాటు జట్టు ఓటములకు కారణమవుతున్నాయి. దాంతో గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గంభీర్‌ను తప్పించి వీవీఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రాలో ఒకర్ని కోచ్‌గా తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సూచిస్తున్నారు.

Ashish Nehra on India Head Coach Role I ll Get the Divorce if I Take the Job

ఈ క్రమంలోనే ఆశిష్ నెహ్రా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు. తనకు టీమిండియా హెడ్ కోచ్ కావాలనే కోరిక ఏం లేదని పేర్కొన్నాడు. అయితే ఆ బాధ్యత కోసం తనను సంపద్రిస్తే.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించాడు.

'టీమిండియా హెడ్ కోచ్ పదవి గొప్ప గౌరవం. కానీ అలాంటి విషయాల గురించి ఎప్పుడూ ప్రణాళికలు సిద్ధం చేసుకోను. భవిష్యత్తులో చూద్దాం. ఇప్పటికైతే నాకు అలాంటి ఆశయం ఏం లేదు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా సంతోషంగా ఉన్నాను. టీమిండియా కోచ్‌గా వస్తానా? లేదా అనే దానిపై ఇప్పుడే సమాధానం చెప్పలేను. ముందుగా నా భార్యను అడగాలి. ఆమెకు చెప్పకుండా ఏదైనా చేశానంటే.. విడాకులు ఇచ్చే ప్రమాదం ఉంది.'అని నవ్వులు పూయించాడు.

గంభీర్‌కు రుణపడి ఉంటా: వాషింగ్టన్ సుందర్

Also Read

గంభీర్‌కు రుణపడి ఉంటా: వాషింగ్టన్ సుందర్

టీమిండియా హెడ్ కోచ్ పదవి అంటే.. ఏడాదిలో దాదాపు 8-9 నెలలు జట్టుతోనే ఉండాల్సి వస్తుందన్నాడు. ఇది అంత సులువైన విషయం కాదని పేర్కొన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా? అంటే అవునని ఇప్పుడే చెప్పలేమన్నాడు.

ప్రపంచకప్‌కు ఇంకా 13 నెలల సమయం ఉందని, ప్రస్తుతానికి రోహిత్, కోహ్లీ జట్టులో కొనసాగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నాడు. టెస్ట్‌లు, టీ20లకు వీడ్కోలు పలికే వన్డేలు మాత్రమే ఆడుతోన్న రోహిత్, కోహ్లీ.. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ వన్డే సిరీస్‌తో బరిలోకి దిగనున్నారు.

Story first published: Tuesday, September 8, 2026, 12:12 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+