గంభీర్‌కు రుణపడి ఉంటా: వాషింగ్టన్ సుందర్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాల వల్లే బ్యాటర్‌గా తాను మరింత మెరుగయ్యానని స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఈ ఇద్దరి కారణంగానే ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలిగానని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరికీ తానెప్పుడు రుణపడి ఉంటానని వెల్లడించాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి అక్షర్ పటేల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించాడు.

ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వాషింగ్టన్ సుందర్.. తన బ్యాటింగ్‌లో వచ్చిన మార్పుకు గంభీర్, ఆశిష్ నెహ్రాలే కారణమని చెప్పాడు. తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించి.. పరిస్థితులకు అనుగుణంగా ఆడేలా తనను తీర్చిదిద్దారని పేర్కొన్నాడు.
'టీ20ల్లో ఫినిషర్‌గా.. టెస్టుల్లో టాపార్డర్ బ్యాటర్‌గా.. వన్డేల్లో పరిస్థితులకు అనుగుణంగా వివిధ పాత్రలు పోషించే అవకాశం నాకు లభిస్తోంది. ఇలా విభిన్న పరిస్థితుల్లో ఆడటం సవాలుతో కూడుకున్నవిషయం. అయినప్పటికీ నేను ఇష్టంగానే ఈ పాత్రలు పోషిస్తున్నా.
జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడే నా ప్రధాన లక్ష్యం. గంభీర్ భాయ్ నా బ్యాటింగ్‌తో నేనేం చేయగలనో.. మెరుగ్గా ఎలా రాణించగలనో తెలిసేలా చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఒక ప్లేయర్‌గా, వ్యక్తిగా నన్న మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు. నా బ్యాటింగ్‌లో ఇంత మార్పు రావడానికి ఈ ఇద్దరే కారణం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలనే అనుభవం వస్తుంది. నా సామర్థ్యంపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించిన కోచ్‌లకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.'అని వాషింగ్టన్ సుందర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

