ఆ బంతులతోనే వెస్టిండీస్‌ను కట్టడి చేశా: అర్ష్‌దీప్ సింగ్
రివర్స్ స్వింగ్ అయ్యే బంతితో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అన్నాడు. రివర్స్ స్వింగ్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేశానని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్(3/44) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. దాంతో ఈ సిరీస్‌లో తొలిసారి ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
డ్యూ లేకపోవడం..
ఈ సందర్భంగా మాట్లాడిన అర్ష్‌దీప్ సింగ్ డ్యూ ప్రభావం లేకపోవడం కలిసొచ్చిందని చెప్పాడు. 'ఈ రోజు మైదానంలో మంచు లేకపోవడం చాలా ఉపయోగపడింది. రివర్స్ స్వింగ్ లభించింది. రివర్స్ స్వింగ్ అయ్యే బంతితో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. గత మ్యాచ్‌లో నేను సరిగ్గా బౌలింగ్ చేయలేదు కాబట్టి.. ఈ సారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని అనుకున్నాను.

మా జట్టులో లీడర్, సీనియర్ అనే తేడాలు ఏమీ లేవు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా ప్రశాంతంగా, చిల్‌గా ఉంది. మేమంతా ఒకరి సక్సెస్‌ను మరొకరం ఆస్వాదిస్తాం. ఎవరికైనా మ్యాచ్ సరిగ్గా సాగకపోతే.. మిగతా వాళ్లంతా అండగా ఉంటూ 'నువ్వు ఈ జట్టులో చాలా కీలకమైన ఆటగాడివి'అని భరోసా ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి, చెడు రోజులు సహజం. మైండ్ సెట్ స్థిరంగా ఉంచుకుంటే మళ్లీ పుంజుకోవచ్చు.
అదే అసలైన సవాల్..
నాకు టీ20 ఫార్మాట్ ఆడటం అంటే చాలా ఇష్టం. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బ్యాటర్లు భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తారు. అప్పుడే బౌలింగ్ చేయడమే అసలైన సవాల్. ఆ సమయంలోనే మన స్కిల్స్, మానసిక ధైర్యం ఏంటో తెలుస్తుంది.
త్వరగా మైదానంలోకి వచ్చి కొత్త బంతి, పాత బంతితో కాసేపు ప్రాక్టీస్ చేసి స్కిల్స్‌ను పదును పెట్టుకోవడంపైనే నా దృష్టి పెడుతాను. షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంటుంది కాబట్టి, ఎవరు ఎంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడితే ఆ టీమ్‌కే విజయం దక్కుతుంది. మేమంతా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాం.'అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


