For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ దగాకోరును వదిలిపెట్టొద్దు.. 2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ ఆరోపణలపై లంక మాజీ కెప్టెన్ ఫైర్

Aravinda de Silva slams Former Sri Lanka minister for making outrageous claim of 2011 World Cup final being fixed

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఫిక్స్‌ అయిందని ఆరోపించిన లంక మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే‌‌పై ఆదేశ మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వసనీయత లేని మహీందానంద భారత్, శ్రీలంక ఆటగాళ్లతో పాటు 2011 ప్రపంచకప్ ఫైనల్‌తో సంబంధం ఉన్న అందరిపై దారుణమైన ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డాడు. తద్వార ఆటగాళ్ల కీర్తీ, ప్రతిష్టలను దెబ్బతీయాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సమగ్ర విచారణ జరపాలి..

సమగ్ర విచారణ జరపాలి..

ఈ విషయంలో బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి నిజనిజాలు తేల్చి.. ఇలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తుల నోళ్లు మూయించాలని కోరాడు. మహీందానంద బేస్‌లెస్ ఆరోపణలు విజయం సాధించిన భారత క్రికెటర్లతో సహా ఎంతో మందిని బాధపెడ్తున్నాయన్నాడు. ముఖ్యంగా భారత అభిమానులు, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను దృష్టిలో ఉంచుకొని సమగ్ర విచారణ జరిపించాలని ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డులను కోరాడు. ‘ఈ నిరాధార ఆరోపణలు చాలా మందిని బాధపెడ్తున్నాయి. కేవలం శ్రీలంక ఆటగాళ్లనే కాదు. సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు విశ్వవిజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను అవమానపరిచేలా ఉన్నాయి. మనమంతా ఇష్టపడే ఆటకోసం ఈ ఆరోపణలన్ని అసత్యమని నిరూపించాలి.'అని సండే టైమ్స్‌తో మాట్లాడుతూ డిసిల్వా చెప్పుకొచ్చాడు. ఇక 2011 ప్రపంచకప్ సమయంలో డిసిల్వా లంక జట్టు సెలెక్టెర్‌గా పనిచేశాడు.

 బీసీసీఐ బాధ్యత..

బీసీసీఐ బాధ్యత..

దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, భారత అభిమానులను అవమానించే విధంగా ఉన్న ఆ ఆరోపణలను బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వం సిరీయస్‌గా పరిగణించాలని డిసిల్వా సూచించాడు. ‘ఈ అసత్య ఆరోపణలను ప్రజల నుంచి దూరం చేయలేం. కాబట్టి ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డులు ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నా. మేం మా ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదించినట్లే.. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ మధుర క్షణాలను జీవితాంతం ఆస్వాదిస్తారు. కాబట్టి సచిన్, లక్షలాది భారత అభిమానుల దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం, బీసీసీఐ నిష్పాక్షిక విచారణ జరపించాలి. అది వారి బాధ్యత కూడా'అని ఈ శ్రీలంక మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా సరికొత్త ఫార్మాట్‌కు ఆదిలోనే బ్రేక్.. ‘3టీ క్రికెట్‌' మ్యాచ్‌ వాయిదా

ఐసీసీకి ఇవ్వాలి..

ఐసీసీకి ఇవ్వాలి..

నిరాధార ఆరోపణలు చేస్తున్న మహీందానంద.. అతనికేమైనా సందేహం ఉన్నా, ఆధారాలు లభించినా వెంటనే ఐసీసీ అవినీతి నిరోధక శాఖ సమాచారం ఇవ్వాలన్నాడు. కానీ ఇలా అర్థం పర్ధం లేని ఆరోపణలతో విలువను తగ్గించుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని 1996 ప్రపంచకప్ విన్నింగ్ ప్లేయర్ అయిన డిసిల్వా స్పష్టం చేశాడు.‘బెస్‌లెస్ ఆరోపణలు చేస్తున్న మహిందానంద.. ఏమైనా సందేహం ఉంటే ఐసీసీ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలి. అది చేయకుండా ఈ విశ్వసనీయత లేని వ్యక్తి 2011 ప్రపంచకప్‌తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి గౌరవానికి భంగం కలిగేలా నోరు పారేసుకుంటున్నాడు. నేను ఎలాంటి విచారణకైనా సిద్దం. కానీ ఈ దగాకోరును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. ఎంతో కష్టపడి గెలిచిన భారత ఆటగాళ్ల పలుకుబడిని దెబ్బతీస్తున్నాడు.'అని డిసిల్వా మండిపడ్డాడు.

విచారణకు ఆదేశం..

విచారణకు ఆదేశం..

తీవ్ర దుమారాన్ని రేపిన ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రపంచకప్ ఫైనల్లో లంక అమ్ముడుపోయిందని, ఫిక్సింగ్‌‌కు పాల్పడంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడిందని మహిదానంద చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు లంక ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి దుల్లాస్‌ అలాహప్పెరుమా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు ప్రగతిపై ప్రతి రెండు వారాలకొకసారి నివేదిక అందించాలని కూడా సూచించారు. మహిదానంద చేసిన ఆరోపణలను లంక దిగ్గజ ఆటగాళ్లు మహేళ జయవర్ధనె, కుమార సంగక్కర ట్విటర్ వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. ఎన్నికల సర్కస్ మొదలైనట్లుందని, ఆధారాలు చూపించాలని జయవర్దనే వ్యంగ్యంగా ట్వీట్ చేయగా.. సాక్ష్యాధారాలను ఐసీసీకి అందజేయాలని సంగక్కర సూచించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో విజయం సాధించింది.

సానియా మీర్జాను పెళ్లిచేసుకున్నానని ఏనాడు బాధపడలేదు: షోయబ్ మాలిక్

Story first published: Monday, June 22, 2020, 12:17 [IST]
Other articles published on Jun 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+