Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా సరికొత్త ఫార్మాట్‌కు ఆదిలోనే బ్రేక్.. ‘3టీ క్రికెట్‌’ మ్యాచ్‌ వాయిదా

Cricket South Africa postpones 3T Cricket Exhibition Match

జొహాన్నె్‌సబర్గ్‌: క్రికెట్‌లో ఒక సరికొత్త ఫార్మాట్‌ మ్యాచ్‌ను చూడాలని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. క్రికెట్‌ను రీస్టార్ట్ చేసేందుకు సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) ఆలోచనలకు ఆదిలోనే బ్రేక్ పడింది. ఈ నెల 27న '3టీ క్రికెట్‌' కాన్సెప్ట్‌తో సాలిడిటరీ కప్ పేరిట నిర్వహించాలనుకున్న ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) శనివారం ప్రకటించింది.

అయితే ఈ ఫార్మాట్‌పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, సాధ్యమైనంత త్వరగా కొత్త తేదీ ప్రకటిస్తామని సీఎస్‌ఏ తెలిపింది. టోర్నీ ఏర్పాట్లకు మరికొంత సమయం కావాలని ఈవెంట్ భాగస్వామ్యులు, ఆపరేషనల్ టీమ్స్ చేసిన సూచనలతో సాలిడారిటీ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ సరికొత్త 3టీ క్రికెట్‌ కాన్సె‌ప్ట్‌లో 36 ఓవర్లతో 8 మంది సభ్యులతో కూడిన మూడు జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహిస్తారు.

ఈ మ్యాచ్‌ను 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా ఆడిస్తారు. మధ్యలో బ్రేక్‌‌ ఉంటుంది. తొలి అర్థభాగంలో ఓ టీమ్.. ఒక ప్రత్యర్థితో ఆరు ఓవర్లు ఆడుతుంది. సెకండాఫ్​లో ఆ జట్టు మరో ప్రత్యర్థితో మరో ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇలా ప్రతి జట్టుకు 12 ఓవర్లు (బ్యాటింగ్, బౌలింగ్) ఆడే అవకాశం లభిస్తుంది.

ఫస్టాఫ్‌‌లో తొలుత ఎవరు బ్యాటింగ్‌‌ చేయాలి, ఎవరు బౌలింగ్‌‌ చేయాలి, ఎవరు డగౌట్‌‌లో ఉండాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ఫస్టాఫ్‌‌లో అత్యధిక‌ స్కోరు చేసిన టీమ్‌‌ సెకండాఫ్‌‌లో మొదట బ్యాటింగ్‌‌ చేస్తుంది. ఒకవేళ స్కోర్లు టై అయితే.. ఫస్టాఫ్​లో ఆడిన స్థానాలను రివర్స్​ చేస్తారు. అంటే మొదట బ్యాటింగ్‌‌ చేసిన టీమ్‌‌తో బౌలింగ్‌‌.. బౌలింగ్‌‌ చేసిన జట్టుతో బ్యాటింగ్‌‌ చేయిస్తారు.

Story first published: Sunday, June 21, 2020, 10:53 [IST]
Other articles published on Jun 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+