Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్.. అది తెలివి తక్కువ నిర్ణయం: అనిల్ కుంబ్లే

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా అనుసరించిన వ్యూహాలను తప్పుబట్టాడు. ముఖ్యంగా శివమ్ దూబేను కాదని హర్షిత్ రాణాను అప్‌ది ఆర్డర్ ఆడించడం తెలివి తక్కువ నిర్ణయమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా జట్టులో నిరంతరం ఆటగాళ్లను మార్చడం సరికాదని సూచించాడు.

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మూడో టీ20లో 202 పరుగుల లక్ష్య ఛేదనలో 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పరుగుల పరంగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇదే ఘోర పరాజయం.

Anil Kumble Slams Team India s Tactics After Defeat in 3rd T20I against England

ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడంతో శివమ్ దూబేకు బదులు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించారు. ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఈ నిర్ణయాన్ని ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్ ఆ సమయంలోనే తప్పుబట్టాడు. ఏంటి తమాషా చేస్తున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో కూడా హర్షిత్ రాణా‌ పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం చూడలేదని తన కామెంట్రీలో అసహనం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్ గురించి అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అనిల్ కుంబ్లే.. టీమిండియా మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు. 'టీ20 క్రికెట్‌లో ఎప్పుడైనా అత్యుత్తమ బ్యాటర్లను ముందు బ్యాటింగ్‌కు పంపించాలి. శివం దూబే లాంటి అద్భుతమైన బ్యాటర్ కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడం తప్పుడు నిర్ణయం. ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న ఆటగాడి కంటే.. ఎనిమిదో నంబర్ బ్యాటర్‌ను ముందు పంపి మ్యాచ్ గెలవాలని చూడటం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ తరం క్రికెట్‌లో ఈ వ్యూహాలు పని చేయవు.

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

టీమిండియా తమ లైనప్‌లో చాలా మార్పులు చేస్తోంది. ఈ విధానాన్ని ఇకనైనా ఆపాలి. బౌలర్లు నిరంతరం మారుతూనే ఉన్నారు. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడని ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టారు. ప్రిన్స్ యాదవ్ జట్టులోకి వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేసి.. రెండో టీ20లోనూ మూడు వికెట్లు తీశాడు. అయినప్పటికీ భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. టీమిండియా తమ ఐదుగురు ప్రధాన బౌలర్లకే కట్టుబడి ఉండాలి. బ్యాటర్లు పరుగులు చేస్తారు. కానీ బౌలర్లు మాత్రమే మ్యాచ్‌లు గెలిపిస్తారు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ గ్రహించాలి.'అని గంభీర్ పేరు ప్రస్తావించకుండా అనిల్ కుంబ్లే చురకలంటించాడు.

Story first published: Thursday, July 9, 2026, 10:02 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+