Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

అంతర్జాతీయ టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయానంతరం టీమిండియా బరిలోకి దిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది. పసికూన ఐర్లాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 0-2తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్ పర్యటనలోనూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దాంతో 20 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది.

అంతేకాకుండా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అంతర్జాతీయ టీ20ల్లో 100+ రన్స్‌తో టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. అది కూడా నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే ఈ చెత్త రికార్డ్ నమోదవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

పిచ్ కండిషన్స్ వల్లే..

ఇంగ్లండ్‌తో మూడో టీ20 పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. జట్టు పేలవ ప్రదర్శనపై వివరణ ఇచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028 కోసం జట్టును రిసెట్ చేస్తున్నామని, కొత్త సారథి, యువ ఆటగాళ్లతో నయా టీమ్‌ను రెడీ చేస్తున్నామని చెప్పాడు.

The Real Issue Behind India Losses in England Struggling Against Swing and Seam Not the Conditions

జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా లేరని, అంతేకాకుండా ఇంగ్లండ్ కండిషన్స్‌ను అలవర్చుకోవడంలో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. ఇవే భారత్ వరుస ఓటములకు కారణమని భావిస్తున్నామని వివరణ ఇచ్చాడు.

స్వింగ్ కండిషన్స్‌లో ఆడలేరు.

కానీ టీమిండియా అసలు సమస్య సీమింగ్, స్వింగ్ కండిషన్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోవడం అనే విషయాన్ని గంభీర్ అంగీకరించలేకపోయాడు. అయితే జట్టుకు ఇది కొత్త సమస్య కాదు. ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను ఈ సమస్య వేధిస్తోంది. భారత్‌లో ఉండే ఫ్లాట్ వికెట్స్, చిన్న మైదానల్లో దూకుడుగా ఆడే మన ఆటగాళ్లు.. స్వింగ్, సీమ్ కండిషన్స్‌లో, స్లో వికెట్‌లపై రాణించలేకపోతున్నారు.

ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఓడటానికి.. ఇంగ్లండ్‌లో వరుస పరాజయాలకు కూడా ఇదే అసలు సమస్య. మూడో టీ20 అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే విషయాన్నివెల్లడించాడు. ఇంగ్లండ్ వికెట్స్.. ఐపీఎల్ పిచ్‌లు కావని చురకలంటించాడు.

ఎందుకు పక్కన పెట్టానో సంజూకు తెలుసు: గౌతమ్ గంభీర్

ఎందుకు పక్కన పెట్టానో సంజూకు తెలుసు: గౌతమ్ గంభీర్

ప్రపంచకప్‌లోనూ..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది. అది కూడా స్లో వికెట్‌పైనే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో మంచి పేస్ బలగం కలిగిన సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ సమస్యను అధిగమించడంపై టీమిండియా ఫోకస్ పెట్టాలి. భారత్‌లో కూడా సీమింగ్, పేస్ కండిషన్స్‌లో ఆడటం అలవర్చుకోవాలి. దేశవాళీ క్రికెట్‌లోనే ఈ తరహా పిచ్‌లతో ఆటగాళ్లను సిద్దం చేయాలి. లేదంటే విదేశీ పర్యటనల్లో భారత్‌కు ఇలాంటి ఘోర పరాజయాలు తప్పవని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.

Story first published: Thursday, July 9, 2026, 8:01 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+