విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మోసం చేశారు: అమిత్ మిశ్రా
టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను మోసం చేశారని మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. జట్టులో అవకాశం కల్పిస్తామని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. లేకుంటే తాను భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అమిత్ మిశ్రా.. తాజాగా ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నాడు. గాయాలతోనే అంతర్జాతీయ కెరీర్‌ను అర్దాంతరంగా ముగించాల్సి వచ్చిందన్నాడు.

'భారత్‌కు ఆడుతున్న సమయంలో బెంగళూరులో నా కాలికి గాయమైంది. అప్పుడు అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నాడు. నా గాయం గురించి ఆయనకు చెప్పగా..'కంగారు పడకు.. ఎంత త్వరగా ఫిట్‌నెస్ సాధిస్తే అంత త్వరగా జట్టులోకి వచ్చేస్తావు'అని భరోసా ఇచ్చాడు. అప్పుడే విరాట్ కోహ్లీ సారథిగా ఎంపికయ్యాడు. జట్టులోకి పునరాగమనం చేయాలంటే ఏం చేయాలని కోహ్లీని అడిగా.. అతను కూడా ఫిట్‌నెస్ సాధించాలని చెప్పాడు.
ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నా.. నాకు అవకాశం రాలేదు. రీఎంట్రీ గురించి కోహ్లీకి మెసేజ్ చేశా. కానీ అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇలా కాదని నేరుగా కోహ్లీ దగ్గరకే వెళ్లి.. బ్రదర్ పరిస్థితి ఏంటి? అని అడిగా. ఒక వారం, పది రోజులు సమయం ఇవ్వాలని బదులిచ్చాడు. అలా వారాలకు వారాలు గడిచినా కోహ్లీ నుంచి సమాధానం రాలేదు.
చివరికి కోహ్లీకి ఫోన్ చేసినా.. మెసేజ్‌లు చేసినా బదులివ్వలేదు. చాలా సార్లు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించి విసిగిపోయా. మనతో వారికి అవసరం లేదనే విషయాన్ని గ్రహించి మౌనంగా ఉండిపోయా. నా కంటే ఎక్కువగా గాయపడిన ఆటగాళ్లు కూడా వెంటనే చోటు దక్కించుకున్నారు. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇప్పటికీ ఇది ప్రశ్నగానే ఉండిపోయింది.'అని అమిత్ మిశ్రా భావోద్వేగానికి గురయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


