Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా యువ బౌలర్ గలీజ్ పని.. అమ్మాయిలకు నగ్న చిత్రాలు!

టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్ చిక్కుల్లో పడ్డాడు. అతనికి సంబంధించిన న్యూడ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలతో అశ్లీలంగా చాట్ చేసాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తన న్యూడ్ ఫొటోలను పంపించడంతో పాటు అమ్మాయిల నగ్న చిత్రాలను పంపాలని అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అతని చాటింగ్‌కు సంబంధించిన న్యూడ్ ఫొటోలతో పాటు చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి.

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

వాష్‌ రూమ్‌లోని అద్దం ముందు నగ్నంగా నిల్చొని తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా టవల్ అడ్డుపెట్టుకొని సెల్ఫీ దిగాడు. ఈ పోస్ట్‌ను స్నాప్ చాట్‌లో స్టోరీగా షేర్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గలీజ్ వ్యవహారం గురించి ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు. కానీ ఎక్స్ వేదికగా జోరుగా చర్చ సాగుతోంది. అటు బీసీసీఐ కానీ.. ఇటు గుర్నూర్ బ్రార్ కానీ ఈ గలీజ్ చాటింగ్ ఆరోపణలపై స్పందించలేదు.

Alleged Private Photo of Indian Cricketer Gurnoor Brar Goes Viral on Social Media

నెటిజన్లు మాత్రం గుర్నూర్ బ్రార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఇదేం గలీజ్ పనని మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు అమ్మాయిల జోలికి వెళ్లి కెరీర్‌లు నాశనం చేసుకున్నారని, వారిని చూసిన తర్వాత కూడా ఇలాంటి పనులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం చేసుకొని విచారణ జరపాలని నెటిజన్లు కోరుతున్నారు.

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

Also Read

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

ఏఐ సాయంతో ఈ నగ్న ఫొటో, చాటింగ్ క్రియేట్ చేశారా? లేక గుర్నూర్ బ్రార్ అప్‌లోడ్ చేశాడా?అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుత గుర్నూర్ బ్రార్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

టీమిండియా యువ క్రికెటర్లు యశ్ దయాల్, అభిషేక్ పోరెల్ అత్యాచారం ఆరోపణలతో ఇప్పటికే తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. అభిషేక్ పోరెల్ అరెస్ట్ కూడా అయ్యాడు. బెయిల్‌పై ఇటీవలే విడుదలైన అతను బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.

Story first published: Monday, November 2, 2026, 10:53 [IST]
Other articles published on Nov 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+