Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి బౌలింగ్ రా అయ్యా.. సిక్సర్‌గా వెళ్లిన వైడ్ బాల్!(వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని బంతిని అమెరికా బౌలర్ అలీ ఖాన్ వేసాడు. సాధారణంగా వైడ్ బాల్ బౌండరీకి వెళ్లడం చూస్తుంటాం. కానీ అలీ ఖాన్ వేసిన బంతి మాత్రం సిక్స్‌‌గా మారింది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేసిన బౌన్సర్ నేరుగా వెళ్లి బౌండరీ బయట పడింది. వికెట్ కీపర్‌ జంప్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఈ విచిత్రకరమైన బంతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే వైడ్ బాల్ సిక్స్‌గా మారడం ఇదే తొలిసారని, గతంలో ఎప్పుడూ ఈ ఫీట్ నమోదు కాలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే వికెట్ కీపర్ వెనుకాల బౌండరీ చాలా తక్కువ దూరంలో ఉండటంతోనే ఈ ఫీట్ నమోదైందని, బౌలర్ తప్పులేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదెక్కడి బౌలింగ్ రా అయ్యా.. నేను ఏడా చూడలే అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు.

జహీర్ ఖాన్ కాదు.. అతని కోసం సీఎస్‌కే బాగా ప్రయత్నించింది: అశ్విన్

జహీర్ ఖాన్ కాదు.. అతని కోసం సీఎస్‌కే బాగా ప్రయత్నించింది: అశ్విన్
Ali Khan Wide Bouncer Goes for a Six in Bizarre Cricket Moment Video Goes Viral

కెనడా వేదికగా జరుగుతున్న సూపర్ 60 టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోరంటో సిక్సర్స్, మిస్సిస్సాగా మాస్టర్స్ మధ్య ఆదివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఈ విచిత్రకరమైన ఫీట్ నమోదైంది. 9వ ఓవర్‌లో నాలుగో బంతిని అలీ ఖాన్ వైడ్‌గా వేయగా.. సిక్స్‌గా మారింది.

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

Also Read

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

ఈ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ సారథ్యంలోని టొరంటో సిక్సర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టొరంటో సిక్సర్స్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్) రాణించాడు. అనంతరం మిస్సిస్సాగా మాస్టర్స్ 7 వికెట్లకు 121 పరుగులే చేసి ఓటమిపాలైంది.

పాకిస్థాన్ సంతతికి చెందిన అలీ ఖాన్ అమెరికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అమెరికా తరఫున ఇప్పటి వరకు 15 వన్డేలు, 21 అంతర్జాతీయ టీ20లు ఆడిన అలీ ఖాన్ 51 వికెట్లు తీసాడు. 118 ప్రొఫెషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడిన అలీ ఖాన్ 110 వికెట్లు తీసాడు. అత్యుత్తమ బౌలింగ్ 4/6.

Story first published: Monday, October 5, 2026, 9:46 [IST]
Other articles published on Oct 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+