Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజిత్ అగార్కర్ గుడ్‌బై.. టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా హైదరాబాద్ మాజీ క్రికెటర్!

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం సెప్టెంబర్‌తో ముగియనుంది. అతని కాంట్రాక్ట్‌ను 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అగార్కర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లో బరిలోకి దిగే భారత జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ ఇదే చివరి సమావేశమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రోహిత్ శర్మను టచ్ చేయడంతోనే అజిత్ అగార్కర్‌పై వేటు!

రోహిత్ శర్మను టచ్ చేయడంతోనే అజిత్ అగార్కర్‌పై వేటు!

టీమిండియా తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో భారత మాజీ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్‌తో పాటు హైదరాబాద్ ప్లేయర్, టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఉన్నట్లు ఎన్డీటీవీ తమ కథనంలో పేర్కొంది. ప్రజ్ఞాన్ ఓజా ఇప్పటికే సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

Ajit Agarkar Set to Exit as BCCI Shortlists Two Candidates for Chief Selector s Role

అగార్కర్ హయాంలో..

అజిత్ అగార్కర్ 2023 జూలైలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని హయాంలో భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుతమైన విజయాలను అందుకుంది. కానీ టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత్.. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ల్లో విజేతగా నిలిచింది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆసియా కప్ టైటిల్‌ను కూడా అందుకుంది.

కానీ టెస్ట్‌ల్లో ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అయ్యింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతుల్లో సిరీస్ కోల్పోవడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలైంది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా మెరుగైన విజయాలు సాధించడంతో ఈ ఏడాది జూన్‌లో ముగిసిన అగార్కర్ పదవి కాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించారు.

గంభీర్, అగార్కర్ కుట్రలకు చీఫ్ ఫిజియో థెరపిస్ట్ బలి!

Also Read

గంభీర్, అగార్కర్ కుట్రలకు చీఫ్ ఫిజియో థెరపిస్ట్ బలి!

కోహ్లీ, రోహిత్ విషయంలో..

అయితే భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వన్డే ప్రపంచకప్ 2027 దాకా కొనసాగించే విషయంలో అగార్కర్, బీసీసీఐ పెద్దల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీ ప్రపంచకప్ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేమంటూ అగార్కర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో రోహిత్, కోహ్లీ మాత్రం తాము కచ్చితంగా వన్డే ప్రపంచకప్ ఆడుతామనే ధీమాతో ఉన్నారు. రోహిత్, కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి కూడా అగార్కర్ వైఖరే కారణమని గతంలో వార్తలు వచ్చాయి. రోహిత్, కోహ్లీ విషయంలో అగార్కర్, బీసీసీఐ మధ్య దూరం పెరిగిందని, అందుకే అగార్కర్ తన పదవి నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Story first published: Thursday, September 17, 2026, 14:55 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+