రోహిత్ శర్మను టచ్ చేయడంతోనే అజిత్ అగార్కర్‌పై వేటు!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రిటైర్ అవ్వమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయా? హిట్ మ్యాన్ టచ్ చేయడంతోనే అగార్కర్‌కు సమస్యగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించాలనే అగార్కర్ ప్రయత్నాలు బెడిసికొట్టాయని, అవే పదవి కోల్పోయేలా చేశాయని ప్రచారం జరుగుతోంది.
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వన్డేకు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ జరిగిన ప్రచారంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన బీసీసీఐ.. అగార్కర్ పదవి కాలాన్ని పొడిగించే విషయాన్ని పున:పరిశీలిస్తుందని వార్తలు వస్తున్నాయి.

గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు వైఫల్యాల నేపథ్యంలోనే రోహిత్ శర్మను రిటైర్ అవ్వాలని సెలెక్టర్లు సూచించారని వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగే చివరి వన్డేనే రోహిత్‌కు ఆఖరి వన్డే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎంతలా సాగిందంటే.. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శర్మ ఆడుతున్నంత కాలం జట్టులో కొనసాగుతాడని సైకియా స్పష్టం చేశాడు.
మరోవైపు ఈ ఊహాగానాలకు తెరదించుతూ రోహిత్ శర్మ లార్డ్స్ వన్డేలో భారీ శతకంతో చెలరేగాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని చాటుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు. రోహిత్ శర్మ వ్యవహారాన్ని సరిగ్గా సమన్వయం చేయలేకపోయిన అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ పెద్దలు కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది.
అతన్ని కొనసాగించాలా? వద్దా? అనేది శ్రీలంక పర్యటన తర్వాత నిర్ణయించనున్నారు. అతన్ని తొలగించి వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ పదవిని అప్పగించాలనే యోచనలో బోర్డు సభ్యులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం సెప్టెంబర్‌లో ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

