మ్యాచ్ విన్నర్‌కే చోటు లేదా? వింతగా ఉంది: అజింక్యా రహానే
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను తప్పించడం వింతగా ఉందని సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రహానే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మేనేజ్‌మెంట్ తీరును తప్పుబడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

'జట్టు నుంచి తప్పించే విషయంపై సెలెక్టర్లు సంజూ శాంసన్‌తో చర్చించి ఉంటారని, సరైన సమాచారం ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోని, జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడం నాకు చాలా వింతగా అనిపించింది. త్వరలోనే అతను మళ్లీ జట్టులోకి పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాను.' అని రహానే తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ఆటగాళ్లకు, సెలెక్షన్ కమిటీకి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని రహానే తన పోస్ట్ ద్వారా అభిప్రాయపడ్డాడు.
జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో సెలెక్షన్ కమిటీ సంచలన మార్పులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో తలపడుతున్న జట్టుతో పోలిస్తే ఈ సిరీస్‌కు ఆరు మార్పులు జరిగాయి.
సంజూ శాంసన్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ ఉద్వాసనకు గురికాగా.. రింకూ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ జట్టులోకి వచ్చారు.
జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జే, రింకూ సింగ్, హర్ష్ దూబె, వరుణ్ చక్రవర్తీ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

