Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ కంపెనీకి అఫ్గానిస్థాన్ X భారత్ టీ20 సిరీస్ మీడియా హక్కులు!

అప్‌కమింగ్ అఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ టీ20 సిరీస్‌ మీడియా హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ సొంతం చేసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)తో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సదరు కంపెనీ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది.

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

ఈ సిరీస్ షెడ్యూల్‌‌ను ప్రకటించిన సమయంలోనే అఫ్గానిస్థాన్ బ్రాడ్‌కాస్టర్ వివరాలను వెల్లడించింది. 'వానీ ఏసీబీ జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగుతోంది. ట్రాన్స్ గ్రూప్.. ఏసీబీ గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేషన్ భాగస్వామిగా.. టీపీటీ360 మీడియా పార్ట్‌నర్‌గా.. ఫ్యాన్‌కోడ్ భారత్‌లో అధికారిక స్ట్రీమింగ్ పార్టన్‌గా వ్యవహరిస్తుంది.'అని ఏసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.

Afghanistan vs India T20I Series Media Rights Given to Pakistan-based TransGroup

ఈ సిరీస్‌ను విదేశాల్లో ప్రసారం చేసే హక్కులను ట్రాన్స్‌గ్రూప్ సొంతం చేసుకుంది. భారత్‌లో ప్యాన్ కోడ్ వేదికగా ఈ మ్యాచ్‌లు వీక్షించవచ్చు. ఈ సిరీస్ భారత్ వేదికగానే జరుగుతున్నా.. అఫ్గానిస్థాన్‌ ఆతిథ్య ఇవ్వనుంది. ఎందుకంటే అఫ్గానిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు లేకపోవడంతో గత కొంతకాలంగా ఆ జట్టు విదేశీ మైదానల్లో పలు సిరీస్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. అందుకోసం భారత్‌తో పాటు యూఏఈలోని క్రికెట్ వేదికలను ఉపయోగించుకుంటుంది.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు టీ20లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 13న తొలి టీ20 జరగనుండగా.. సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 జరగనుంది. ఇటీవలే భారత్‌లో పర్యటించిన అఫ్గానిస్థాన్.. ఏకైక టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఏకైక టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకుంది.

ఇరు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ 2024 జనవరిలో జరిగింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20‌లో ఇరు జట్లు 212 పరుగులే చేయగా.. భారత్ రెండో సూపర్ ఓవర్‌లో గెలిచింది. ఈ మ్యాచ్ భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

Also Read

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

అఫ్గానిస్థాన్ X భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..

తొలి టీ20: సెప్టెంబర్ 13

రెండో టీ20: సెప్టెంబర్ 15

మూడో టీ20: సెప్టెంబర్ 17

Story first published: Thursday, August 27, 2026, 9:55 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+