అభిషేక్ శర్మ అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. వైల్డ్ ఫైర్!
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. జింబాబ్వే పర్యటనలో తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఒకటి రెండు సిరీస్‌లు సరిగ్గా ఆడనంత మాత్రాన తన బ్యాటింగ్ సత్తా తగ్గిపోదని చురకలంటించాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
బుమ్రా బౌలింగ్‌లో అలర్ట్‌గా ఉంటాం..
ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తనదైన శైలిలో విమర్శకులకు బదులిచ్చాడు. 'తొలి ఓవర్‌లోనే స్లిప్‌లో క్యాచ్ పట్టడం వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ రోజు నా ఆటను అద్భుతమైన క్యాచ్‌తో ఆరంభించాను. అందుకు చాలా సంతోషంగా ఉంది.

బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న విషయం. నెట్స్‌లో అతని బౌలింగ్ ఎదుర్కొంటున్నప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే స్లిప్‌లో ఉన్నా.. బ్యాటింగ్ చేస్తున్నా బుమ్రా బౌలింగ్‌లో ఎప్పుడూ చాలా అలెర్ట్‌గా ఉంటాం.'అని అభిషేక్ శర్మ తెలిపాడు.
ఒక సిరీస్ ఆడకపోతే..
ఫామ్ అందుకోవడం గురించి అడగ్గా.. 'రెండేళ్ల క్రితం మేమంతా ఒక నిర్దిష్టమైన శైలిలో ఆడాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచకప్ ముందు ఏడాది పొడవునా అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నాం. అది జట్టు మొత్తానికి, ముఖ్యంగా బ్యాటర్లకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒకటి రెండు సిరీస్‌లు సరిగ్గా ఆడనంత మాత్రాన మా బ్యాటింగ్ సత్తా ఏం తగ్గిపోదు.
బ్యాటింగ్ యూనిట్‌గా మేం ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఓపెనర్లుగా మంచి ఆరంభం ఇవ్వాలనేది మా ఆలోచన. ముఖ్యంగా ఇలాంటి వికెట్లపై 150- 160 పరుగులు ఛేజ్ చేస్తున్నప్పుడు, ఓపెనర్లుగా మంచి ఆరంభాన్ని ఇస్తే జట్టు విజయం దాదాపు ఖాయమవుతుంది.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ వ్యాఖ్యలను ఫ్యాన్స్ పుష్ప ఐకానిక్ డైలాగ్ 'అభిషేక్ శర్మ అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. వైల్డ్ ఫైర్!'తో పోల్చుతూ కామెంట్ చేస్తున్నారు.
అభిషేక్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/19) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 ) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


