Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహకారంతోనే రికార్డ్ సెంచరీ నమోదు చేశానని విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తాను దూకుడుగా ఆడేందుకు కావాల్సిన స్వేచ్ఛను కెప్టెన్, కోచ్ ఇచ్చారని చెప్పాడు. వారి ప్రోత్సాహంతోనే తాను ఇంత ధైర్యంగా ఆడగలిగానని పేర్కొన్నాడు.

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) ఫాస్టెస్ట్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌండరీల ద్వారానే 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదెక్కడి సెలెబ్రేషన్స్ రా అయ్యా.. సునామీ సృష్టించి సుద్దపూసలా కూసున్నావ్!(వీడియో)

ఇదెక్కడి సెలెబ్రేషన్స్ రా అయ్యా.. సునామీ సృష్టించి సుద్దపూసలా కూసున్నావ్!(వీడియో)

కోచ్‌, కెప్టెన్ సాయంతోనే..

ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. ఒకటి, రెండు సిరీస్‌ల్లో విఫలమైనంత మాత్రాన తన బ్యాటింగ్ సత్తా ఎక్కడికిపోదని మరోసారి గుర్తు చేశాడు. 'మనం దూకుడుగా ఆడాలనుకున్నప్పుడు కెప్టెన్, కోచ్ మద్దతు ఉండటం చాలా ముఖ్యం. మేనేజ్‌మెంట్, కోచ్‌లు, కెప్టెన్ నుంచి ఆ నమ్మకం, భరోసా మనకు రావాలి. వారి ప్రోత్సాహంతోనే గత కొన్నేళ్లుగా మేమింత ధైర్యంగా ఆడగలుగుతున్నాం. భవిష్యత్తులోకూ ఇదే దూకుడును కొనసాగిస్తాం.

Abhishek Sharma Credits India Head Coach and Captain for Historic Century Against Afghanistan

మైదానంలో ఒకవైపే షాట్స్ ఆడాలని నేను అనుకోను. బంతి చూడటం.. దానికి తగ్గట్లు ఆడటమే నా గేమ్ ప్లాన్. తొలి రోజు నుంచి నా శైలి ఇదే. మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా నా ఆటను ఆస్వాదించాలనుకుంటాను తప్ప, బలవంతంగా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించను. బంతిని చూసి బాదడమే నా పని. అయితే ప్రతీసారి అనుకున్నట్లే బాగా ఆడతామని గ్యారెంటీ ఉండదు. కాకపోతే, మా జట్టులో మేం ఒక సంస్కృతిని పెంచుకుంటున్నాం. ఆరంభం నుంచీ ఆధిపత్యం చెలాయించాలి. పవర్ ప్లేను పూర్తిగా వాడుకోవాలి. ఆ ప్లాన్ ప్రస్తుతం చాలా బాగా వర్కౌట్ అవుతోంది.

ప్రత్యర్థికి తగ్గట్లు ప్రిపేర్ అవుతా..

గత రెండేళ్లుగా మేం ఇదే శైలిలో ఆడుతున్నాం. ఒకటి లేదా రెండు సిరీస్‌లు సరిగ్గా ఆడనంత మాత్రాన బ్యాటింగ్ యూనిట్‌గా మా సత్తా మారిపోదు. వరల్డ్ కప్‌కు ముందు ఏడాది పొడవునా.. ప్రత్యర్థితో పనిలేకుండా ఆధిపత్యం చెలాయించాలనుకున్నాం. ఒక క్రికెటర్‌గా.. బ్యాటర్‌గా ఆటలో ఎత్తుపల్లాలు సహజం. కానీ ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణం, ఆలోచనా విధానమే అత్యంత ముఖ్యం. మేమంతా ఒకే జట్టుగా నిలబడి.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడం మా లక్ష్యం.

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

Also Read

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

నేను భారీ షాట్స్ ఆడటం అనేది.. ప్రతి సిరీస్‌కి ముందు నా సన్నదతపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి జట్టుకు తగ్గట్లు నేను సిద్దమవుతా. ఎవరితో మ్యాచ్ ఆడబోతున్నాం. బౌలర్లు ఎవరు అనే విషయంలో నేను పూర్తి క్లారిటీతో ఉంటాను. పవర్ ప్లేను ఎలా వాడుకోవాలి, పవర్ ప్లేలో ఎవరు బౌలింగ్ చేస్తారు, ఆ తర్వాత 7వ, 8వ ఓవర్లలో పరిస్థితి ఏంటి అనేదానిపై పూర్తి క్లారిటీతో ఉంటాను. ఇదే నా బ్యాటింగ్ ప్లాన్'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, September 18, 2026, 0:02 [IST]
Other articles published on Sep 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+