న్యూజిలాండ్‌పై ఊచకోత.. మళ్లీ అభిషేక్ శర్మదే అగ్రస్థానం!
న్యూజిలాండ్‌పై విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 897 రేటింగ్ పాయింట్స్‌తో ఇషాన్ కిషన్(866)ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. గజ్జ గాయంతో గత రెండు టీ20 మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ దూరమైన విషయం తెలిసిందే. దాంతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు.
పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాద ఫర్హాన్(883) రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్ ఐదు స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన తిలక్ వర్మ 724 రేటింగ్ పాయింట్స్‌తో పదో ర్యాంకును అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంజూ శాంసన్ ఆరు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్ అందుకున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ 9 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్ సాధించాడు.

టాప్-10లో ఒక్కరు లేరు..
భారత్ చేతిలో చిత్తుగా ఓడినా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాత్రం బౌలింగ్ విభాగంలో మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో కట్టడిగా బౌలింగ్ చేయడంతో పాటు రెండో టీ20లో నాలుగు వికెట్లు తీయడంతో సాంట్నర్ 665 రేటింగ్ పాయింట్స్‌తో ఏడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్(733) అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. అక్షర్ పటేల్ 11వ స్థానంలో కొనసాగుతుండగా.. అర్ష్‌దీప్ సింగ్ 6 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకులో నిలిచాడు.
టెస్ట్‌ల్లో దుమ్మురేపిన మార్కో జాన్సెన్..
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ మార్క జాన్సెన్ దుమ్మురేపాడు. బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఐదు స్థానాలు ఎగబాకిన అతను 876 రేటింగ్ పాయింట్స్ టాప్ ర్యాంక్ అందుకున్నాడు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 853 రేటింగ్ పాయింట్స్‌తో ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో రవీండ్ర జడేజాను వెనక్కి నెట్టిన మార్కో జాన్సెన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్ టెస్ట్ క్రికెట్ ఆడి చాలా రోజులు కావడంతో ర్యాంకులపై ప్రభావం చూపింది. బ్యాటింగ్ విభాగంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని అందుకున్నాడు. ఆసీస్‌పై అతను అద్భుత సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో కొసాగుతున్నాడు. భారత్ నుంచి రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్‌మన్ గిల్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


